శ్రీరాంపూర్ : మెడికల్ బోర్డులో కొత్త మార్పులు తెచ్చారు. ఇకపై రెండంచెల పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహిస్తారు. కొత్త విధానానికి సంబంధించి యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యూలర్ నంబర్ సీఆర్‌పీ/పీఈఆర్/ఐఆర్‌అండ్‌పీఎం/సీ/81/2088 ననుసరించి మెడికల్ బోర్డు పని చేస్తుంది. గతంలో ఒకటే బోర్డు ఉంటే కొత్త సర్క్యూలర్ ప్రకారం కార్పొరేట్ మెడికల్ బోర్డు, అప్పిలేట్ మెడికల్ బోర్డు అను రెండు రకాలు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతీ బోర్డులో ఆరుగురు సభ్యులు ఉంటారు.
కార్పొరేట్ మెడికల్ బోర్డు నెలకు రెండు సార్లు సమావేశం అవుతుంది. ఇందులో సీజీఎం(పీపీ), సీఎంవో, జీఎం(మైనింగ్), జీఎం(పర్సనల్), ఏజీఎం, నిపుణుడైన వైద్యుడు ఉంటారు. అప్పిలేట్ మెడికల్ బోర్డు మూడునెలలకోసారి సమావేశం అవుతుంది. ఇందులో నిమ్స్ నుంచి ఒక వైద్యుడితోపాటు ఐదుగురు కంపెనీ డెరైక్టర్లు, పర్సనల్ అండ్ వెల్ఫేర్, ఆపరే షన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, ఫైన్సాన్స్, ఈఅండ్‌ఎండ్ విభాగాలకు చెందిన వారు ఉంటారు.
కొత్త సర్క్యూలర్ జూలై 1 నుంచి అమలు అవుతుంది. క్యాన్సర్, లెప్రసీ, పెరాలసిస్, గుండెపోటు, అంధత్వం, కిడ్నీల సమస్యలు, గని ప్రమాదాలు, బయటి ప్రమాదాలు, ఎముకలు విరగడం, శరీరాకృతిలో మార్పులు రావడం వంటి పలు వ్యాధులతో బాధపడేవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ధారుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా బోర్డుకు ఎప్పుడు హాజరుకావాలో మెస్సేజ్ వస్తుంది. కార్పొరేట్ బోర్డులో అన్‌ఫిట్ కాని వారు అప్పిలేట్ మెడికల్ బోర్డుకు 60 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతీ నెల 10న దరఖాస్తు చే సుకున్న వారి దరఖాస్తులను సీరియల్ నంబర్లు ఇచ్చి దాని ఆధారంగా పిలుస్తారు. పీఎంఈ, కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేయబడిన వారికి సీరియల్‌లో 50 శాతం ప్రాధాన్యతఇస్తారు. ఇంకా 24 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మెడికల్ బోర్డుకు హాజ రైన వారు అదే కారణంతో తిరిగి సంవత్సరం వరకు అనుమతించరు.
ఇదిలా ఉంటే కొత్త విధానం వల్ల మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఫిట్ లేదా అన్‌ఫిట్లు త్వరగా అవుతాయని, గుర్తింపు సంఘంగా తాము ఒత్తిడి చేయడంతోనే యాజమాన్యం ఈ రెండంచెల విధానం ప్రవేశపెట్టిందని టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి గోవర్ధన్, నాయకులు పానుగంటి సత్తయ్య, ఏ సమ్మిరెడ్డి, గోపాల్, రమణారావు తెలిపారు. దీని కోసం తమ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు.
రెండంచెల విధానంలో మెడికల్ బోర్డు
Published Fri, Jul 4 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement