Radhika Apte opens up on losing roles to younger actresses: 'It is a fact'
Sakshi News home page

Radhika Apte : 'అవకాశాల కోసం ఏనాడు అడ్డదారులు తొక్కలేదు, ఆ పని చేయలేదు'

Published Sat, Nov 12 2022 1:13 PM | Last Updated on Sat, Nov 12 2022 3:11 PM

Radhika Apte Opens Up On Losing Roles To Younger Actresses - Sakshi

నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్‌ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బోల్డ్‌నెస్‌ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా  ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే యంగ్‌ హీరోయిన్స్‌ వల్ల అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపింది.  లుక్స్‌ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'హీరోయిన్స్‌కి ఆఫర్స్‌ రావడంలో వయసు అనేది కూడా ప్రధానమైన అంశం. అందుకే కమర్షియల్‌ చిత్రాల్లో యంగ్‌ హీరోయిన్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి.

అంతేకాకుండా టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. నేను మాత్రం అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదు. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఏనాడు అ‍డ్డదారులు తొక్కలేదు.  కానీ సక్సెస్‌ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement