young heroines
-
క్రేజీ ఆఫర్ కొట్టేసిన దుషార! ధనుష్ 50 చిత్రంలో చాన్స్?
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. నటుడిగానే కాకుండా గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా సత్తాచాటుతున్నారు. కథానాయకుడిగా హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నారు. ఈయన తాజా చిత్రం వార్నీ (తెలుగులో సార్) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా తమిళంలో నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ధనుష్ కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన తన 50వ చిత్రానికి సిద్ధమయ్యారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే దీన్ని నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈయన చాలా కాలం క్రితమే పవర్ పాండి అనే చిత్రంతో మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన 50 చిత్రానికి మెగా ఫోన్ పట్టనున్నారన్న మాట. ఇకపోతే ఇందులో కథానాయికగా నటించే లక్కీచాన్స్ ఓ యువ నటిని వరించినట్లు సమాచారం. ఇంతకుముందు పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్ట పరంపరై చిత్రంలో ఆర్యతో జత కట్టిన నటి దుషార విజయన్, ఇటీవల నక్షత్రం నగర్గిరదు చిత్రంలోనూ నటించింది. ఈ భామకే ఇప్పుడు ధనుష్ సరసన నటించే అదృష్టం వరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోయాను : రాధికా ఆప్టే
నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే యంగ్ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపింది. లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'హీరోయిన్స్‌కి ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ప్రధానమైన అంశం. అందుకే కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. నేను మాత్రం అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదు. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఏనాడు అడ్డదారులు తొక్కలేదు. కానీ సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది. -
యంగ్ హీరోయిన్లపై కన్నేసిన ఉదయనిధి
యువ నటుడు ఉదమనిధి స్టాలిన్ ఆరంభంలో టాప్ హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ఒరుకల్ ఒరుకన్నాడి చిత్రంలో బొద్దుగుమ్మ హన్సికను తనకు జతగా ఎంచుకున్నారు. ఆ తరువాత వరుసగా నయనతార, ఎమీజాక్సన్ వంటి టాప్ హీరోయిన్లతో నటించారు. ఇటీవల మంచి విజయాన్ని సాధించిన మనిదన్ చిత్రంలో నాయకి హన్సికనే నన్నది గమనార్హం. ఇలా క్రేజీ హీరోయిన్లతోనే నటించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్న ఉదయనిధి స్టాలిన్ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో యంగ్ నాయికలతో రొమాన్స్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఎళిల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో నటి రెజీనా నాయకిగా నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న మరో చిత్రానికి గౌరవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ఉదయనిధి తాజాగా మరో చిత్రానికి సైన్ చేశారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించనున్నారు. దళపతి ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఒరునాళ్ కూత్తు చిత్రం ఫేమ్ నివేదా పేతురాజ్ ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఉదయనిధి ఇలా టాప్ నాయికలను పక్కన పెట్టి యువ నాయికలపై కన్నేయడానికి కారణం ఏమిటబ్బా అని ఆరా తీసేపనిలో పడింది కోలీవుడ్.