Tamannaah's reply to wedding rumors with a Businessman on social media
Sakshi News home page

Tamanna Bhatia: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

Published Thu, Nov 17 2022 10:31 AM | Last Updated on Thu, Nov 17 2022 11:11 AM

Tamannaah Denied Her Marriage Rumours With a Businessman - Sakshi

హీరో​యిన్‌ తమన్నా పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలు అల్లుతున్నారు. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది తమన్నా. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది! దీంతో అది చూసి నెటిజన్లంత ఖంగుతిన్నారు. కొద్ది రోజులుగా వస్తున్న తన పెళ్లి రూమర్స్‌పై ఆమె స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో షేర్‌ చేసింది.

‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే’ అంటూ వీడియోను పంచుకుంది. అయితే అందులో ఉన్నది తమన్నా అని తెలిసి అంతా షాకయ్యారు. కాగా గతంలో తమన్నా మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియో ఇది. ‘ఎఫ్‌ 3’ మూవీ సమయంలో తీసుకున్న వీడియో ఇది. ఈ చిత్రంలో తమన్నా పలు సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్‌ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్‌ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement