Actor Naresh 3rd Wife Ramya Allegations On His 4th Wedding With Pavitra Lokesh - Sakshi
Sakshi News home page

Actor Naresh-Pavithra Lokes Marriage: వివాదంలో నరేశ్‌ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు

Published Fri, Jul 1 2022 6:05 PM | Last Updated on Fri, Jul 1 2022 7:42 PM

Actor Naresh 3rd Wife Ramya Allegations On His 4th Wedding With Pavitra Lokesh - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన నటి పవిత్రా లోకేశ్‌ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పవిత్రతో వివాహంపై నరేశ్‌ స్పందించలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరాశలో కుంగిపోయి ఉన్నప్పుడు పవిత్ర తనకు అండగా నిలిచారని చెప్పారు. మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్‌ 4వ పెళ్లి వార్తలపై ఫైర్‌ అయ్యారు. తనకు, నరేశ్‌కు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్‌ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు. ‘నరేశ్‌ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్‌ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. అలాగే నరేశ్‌ జనవరిలో తనపై ఫిర్యాదు చేసిన విషయంపై కూడా ఆమె స్పందించారు. జూన్‌లో నాకు నోటీసులు అందాయని, వీటిపై తాను లీగల్‌ కోర్టులోనే ఫైట్‌ చేస్తానని ఆమె పేర్కొన్నారు. 

రమ్య చెప్పేదంత అబద్ధం: నరేశ్‌
నరేశ్‌ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్‌ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్‌ మెయిల్‌ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్‌ చేశాను.

కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను పవిత్రను పెళ్లి చేసుకోలేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నాకు పవిత్ర ఎమోషనల్‌ సపోర్టు మాత్రమే. పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. 

పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి: సుచేంద్ర
ఈ పెళ్లి వార్తలపై పవిత్ర లోకేశ్‌ భర్త డైరెక్టర్‌ సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది పైలా పచ్చిస్‌ జీవితమని, అందుకు తనని వదిలి వెళ్లిపోయిందన్నారు.

సుచేంద్ర నా భ‌ర్త కాదు..
సుచేంద్ర త‌న మొద‌టి భ‌ర్త అంటూ వస్తున్న వార్త‌లపై కూడా క్లారిటీ ఇచ్చారు ప‌విత్రా లోకేశ్. ‘సుచేంద్ర నా భ‌ర్త కాదు. నేను ఆయ‌న‌తో రిలేష‌న్ షిప్‌లో మాత్ర‌మే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్ర‌కు దూరంగా ఉంటున్నా’ అన్నారు. కొంత‌మంది సోష‌ల్ మీడియాలో న‌కిలీ అకౌంట్స్ తో త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ప‌విత్రా లోకేశ్ ఇప్ప‌టికే కర్ణాట‌క సైబర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా..ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు పోలీసులు. అలాగే నరేశ్‌తో​ తన రిలేషన్‌పై నోరు విప్పిందామె. ఫార్మ్‌ హౌజ్‌లో నరేశ్‌తో కలిసి ఉంటున్నానని, నరేశ్‌ ఫ్యామిలీ మెంబర్‌గా తనని అంగీకరించారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement