Did Jayasudha Get Married Again At The Age Of 64? - Sakshi
Sakshi News home page

Jayasudha: జయసుధ అతడిని మూడో పెళ్లి చేసుకుందా? ఇంతకి ఆ వ్యక్తి ఎవరు?

Published Fri, Jan 13 2023 5:58 PM | Last Updated on Fri, Jan 13 2023 6:31 PM

Is Actress Jayasudha Get Married Again At The Age of 64 - Sakshi

జయసుధ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 80లలో హీరోయిన్‌గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఆమె సినీప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌, ఫ్యామీలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో తెలుసా? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

ఇటీవల వారసుడు(తమిళంలో వారీసు) మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ నిలిచింది. ఇమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిస్తున్నారట. ఏ కార్యక్రమం అయిన మూవీ ఈవెంట్‌ అయిన అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్‌ అలీ కూతురి పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది. 

దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్త అని తెలిస్తోంది. అతడిని ఆమె సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ! ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. అదే సమయంలో జయసుధ ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జయసుధ ఈ వార్తలపై స్పందించేవరకు వేచి చూడాలి.

చదవండి: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’

కాగా  జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్‌ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement