senior hero naresh
-
వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు..
సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన నటి పవిత్రా లోకేశ్‌ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పవిత్రతో వివాహంపై నరేశ్ స్పందించలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరాశలో కుంగిపోయి ఉన్నప్పుడు పవిత్ర తనకు అండగా నిలిచారని చెప్పారు. మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్ 4వ పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. తనకు, నరేశ్‌కు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. అలాగే నరేశ్ జనవరిలో తనపై ఫిర్యాదు చేసిన విషయంపై కూడా ఆమె స్పందించారు. జూన్‌లో నాకు నోటీసులు అందాయని, వీటిపై తాను లీగల్ కోర్టులోనే ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. రమ్య చెప్పేదంత అబద్ధం: నరేశ్ నరేశ్ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్ చేశాను. కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను పవిత్రను పెళ్లి చేసుకోలేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నాకు పవిత్ర ఎమోషనల్ సపోర్టు మాత్రమే. పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి: సుచేంద్ర ఈ పెళ్లి వార్తలపై పవిత్ర లోకేశ్ భర్త డైరెక్టర్ సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది పైలా పచ్చిస్ జీవితమని, అందుకు తనని వదిలి వెళ్లిపోయిందన్నారు. సుచేంద్ర నా భర్త కాదు.. సుచేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు పవిత్రా లోకేశ్. ‘సుచేంద్ర నా భర్త కాదు. నేను ఆయనతో రిలేషన్ షిప్లో మాత్రమే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్రకు దూరంగా ఉంటున్నా’ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పవిత్రా లోకేశ్ ఇప్పటికే కర్ణాటక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే నరేశ్‌తో తన రిలేషన్‌పై నోరు విప్పిందామె. ఫార్మ్ హౌజ్‌లో నరేశ్‌తో కలిసి ఉంటున్నానని, నరేశ్ ఫ్యామిలీ మెంబర్‌గా తనని అంగీకరించారని చెప్పారు. -
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
Is Senior Actor Naresh Getting Married With Pavithra Lokesh: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మాట చాలా సార్లు వింటుంటాం. కానీ అప్పుడప్పుడు కొన్ని సార్లు అది ప్రూవ్ అవుతుంటుంది కూడా. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సీనియర్ హీరో, నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్లు చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వర్ వెళ్లి ఒక స్వామిజీని దర్శించుకోవడంతో ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్ ఇప్పటికే దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే టాక్ ఉంది. కానీ తన భార్యలతో మనస్పర్థలు రావడంతో ఆయన విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేష్ తనకు ఈ వయసులో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే పలు సినిమాల్లో తనతో కలిసి నటించిన పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే ఆమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించకపోవడం, కలిసి నటిస్తుండడం, కలిసి కనిపిస్తుండడంతో ఈ టాక్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
ఇది మా అందరికీ గుణపాఠం: సీనియర్ హీరో
నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాటిపై రేగిన దుమారం తామందరికీ ఒక గుణపాఠమని, నటీనటులంతా దీన్ని గుర్తించాలని సీనియర్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతినిధి నరేష్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చాలావరకు జోకులతోనే కొనసాగుతాయని, కానీ కొంతమంది నటులు హాస్యానికి, అవసరం లేని వ్యాఖ్యలకు మధ్య ఉండే చిన్న మంచుపొరను గుర్తించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని అన్నారు. ఏదో ఉత్సాహంలో ఒక మాట మాట్లాడటం, అది సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉందని చెప్పారు. అందువల్ల నటీనటులు సంయమనం పాటించడం అవసరమని ఆయన తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎలా ఉన్నా వాళ్ల ఇష్టమని, అయితే సభలో ఉన్నప్పుడు మాత్రం అలా జరగకుండా చూసుకోవడం తమ అందరి బాధ్యత అని చెప్పారు. -
ఇది మా అందరికీ గుణపాఠం