Buzz: Is Sreemukhi Going To Marriage With a Businessman - Sakshi
Sakshi News home page

Anchor Sreemukhi: బిజినెస్‌మెన్‌తో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!

Jan 3 2023 1:51 PM | Updated on Jan 3 2023 2:45 PM

Buzz: Is Sreemukhi Going to Marriage With a Businessman - Sakshi

యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చదవండి: లగ్జరీ ‍కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్‌ చూశారా?

ఓ బడా వ్యాపారవేత్తతో త్వరలోనే ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే చాలాసార్లు శ్రీముఖి పెళ్లి రూమార్స్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్తా గట్టిగానే ఆమె పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతడినే ఆమె పరిణయం ఆడబోతుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసల వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: 'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్‌పై శ్రుతి కౌంటర్‌

అంతేకాదు ఇటీవల రెండు కటుంబాలు కలిసి మాట్లాడుకున్నారట. ఇక ముహుర్తం ఫిక్స్‌ చేయడమే మిగిలి ఉందంటున్నాయి సన్నిహిత వర్గాలు. అన్ని ఏర్పాట్లు అయ్యాక శ్రీముఖీ పెళ్లిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ యాంకరమ్మా స్పందించేవరకు వేచి చూడాలి. అయితే కాస్తా బొద్దుగా ఉండే శ్రీముఖి బక్కచిక్కిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే ఆమె సన్నగా నాజుగ్గా తయారైందంటూ మరోవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి శ్రీముఖి తన పెళ్లి వార్తలపై ఈసారి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement