Bigg Boss Dethadi Harika Marriage With Youtuber, Rumors Goes Viral - Sakshi
Sakshi News home page

Alekhya Harika Marriage: సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ! వరుడు అతడేనా?

Published Thu, Oct 13 2022 1:26 PM | Last Updated on Thu, Oct 13 2022 2:05 PM

Dethadi Harika Marriage Rumors Goes Viral With Youtuber - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక అలియాస్‌ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్‌ చానల్‌తో ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకున్న ఆమె అభిమానులకు మరింత చేరువయ్యింది. హౌజ్‌లో అభి-హారిక బాండింగ్‌ చూసి వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉందంటూ చర్చించుకున్నారు.

చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే ఆ రిలేషన్‌ హౌజ్‌ వరకే పరిమితమైంది, బయటకు వచ్చాక వీరిద్దరు కలుసుకుంది కూడా చాలా తక్కువ. దీంతో వారిద్దరి మధ్య ఏం లేదని స్పష్టమైంది. బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్‌ బిజీగా మారింది. మరోవైపు సోషల్‌ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: దీపావళికి ఓటీటీలో ‘కృష్ణ వ్రింద విహారి’ సందడి, స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎక్కడంటే

ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఓ యూట్యూబర్‌తో హారిక ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య హారిక ప్రియుడితో సైలెంట్‌గా ఏడడుగుల వేయబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హారిక స్పందించేవరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement