Actress Varsha Bollamma Marriage Rumours Goes Viral With Producer Son, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Varsha Bollamma: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్‌ హీరోయిన్‌ వర్ష!

Published Thu, Oct 27 2022 2:03 PM | Last Updated on Thu, Oct 27 2022 6:09 PM

Varsha Bollamma Marriage Rumours Goes Viral With a Producer Son - Sakshi

యంగ్‌ హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట. అది కూడా ఓ సీనియర్‌ బడా ఇంటికి కోడలిగా వెళ్లబోతుందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన వర్ష.. మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌తో స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆమెకు వరుస ఆఫర్స్‌ తలుపు తడుతున్నాయి. తాజాగా ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు గణేశ్‌ సరసన స్వాతిముత్యంలో నటించింది.

చదవండి: అనసూయ పక్కన ఉన్న ఈ కొత్త వ్యక్తి ఎవరు? అతడితో అంత క్లోజ్‌ ఏంటి..

ఈ సినిమాతో ఆమె మరో హిట్‌ కొట్టేసింది. ప్రస్తుతం స్వాతిముత్యం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వర్ష పెళ్లి గురించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే తెరపై వర్ష అందం, అభినయానికి ఓ సీనియర్‌ నిర్మాత కొడుకు ఫిదా అయ్యాడట. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో సదరు నిర్మాత ఒకే అనేశాడట. ఇక బయట కూడా వర్ష వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను కొడలిగా చేసుకునేందుకు ఆ మాజీ నిర్మాత ఆసక్తిగా ఉన్నాడట.

చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో..

దీంతో ఆలస్యం చేయకుండా పెళ్లి విషయాన్ని వర్ష తల్లిదండ్రులతో మాట్లాడాడట ఆయన. ఇరు కుటుంబాలు చర్చించుకుని పెళ్లికి ఒకే చెప్పుకున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ, వర్ష ఓ పెద్దింటికి కోడలిగా వెళుతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ సంబర పడిపోతున్నారు. ఇక ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే వర్ష బొల్లమ్మ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement