![Eesha Rebba Marriage Rumors Goes Viral With Tamil Director - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/8/esha-rebba.jpg.webp?itok=PLzGV2Bu)
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ.. పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.
చదవండి: ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే
ఈ క్రమంలో తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఆమె కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ప్రస్తుతం దక్షిణాన పలు చిత్రాలు చేస్తున్న ఈషా ఈక్రమంలో అక్కడి ఓ స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందట. ఇక త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని, కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఒక్కటికాబోతున్నారంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ తెలుగు బ్యూటీ స్పందించేవరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు బయటకు రావడంతో ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆమె ఫాలోవర్స్.
చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment