Sidharth Malhotra Addresses Wedding Rumours With Kiara Advani, Deets Inside - Sakshi
Sakshi News home page

Sidharth Malhotra: నా పెళ్లికి నన్ను ఎవరూ ఆహ్వానించలేదు: సిద్దార్థ్ మల్హోత్రా

Published Thu, Jan 12 2023 3:52 PM | Last Updated on Thu, Jan 12 2023 4:49 PM

Sidharth Malhotra addresses rumours of a wedding with Kiara Advani - Sakshi

ఈ ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన జంట హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, హీరోయిన్‌ కియారా అద్వానీ. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీలెక్కనున్నట్లు రూమర్స్ హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెగ వైరలయ్యాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్యాలేస్‌ వివాహ వేదిక కానుందనీ.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్‌ వినిపించింది. అయితే ఈ వార్తలను ఈ జంట ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. 

(ఇది చదవండి: కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?)

కానీ ఈ వార్తలపై తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా నోరు విప్పారు. ఇప్పటికీ నా పెళ్లికి ఇంకా నన్ను ఎవరూ ఆహ్వానించలేదు. ప్రజలు కూడా ఎవరు పిలవలేదు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి తేదీలు కూడా విన్నా. అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహగానాల కంటే.. నా సినిమాలపై దృష్టి సారిస్తే మంచిది. అదే నాకు నచ్చుతుంది.' అని అన్నారు. ఇటీవల కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా పెళ్లి  గురించి రూమర్స్ పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే  హీరోయిన్‌. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు.    

షేర్షా సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి మిషన్ మజ్నుతో ఓటీటీలో అలరించనున్నారు. జనవరి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. చివరిసారిగా సిద్ధార్థ్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో నటించిన థ్యాంక్ గాడ్‌లో కనిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement