‘పెళ్లి చేసుకోను.. సినిమాలను వదలను’ | Varalaxmi Sarathkumar Rubbishes Wedding Rumours | Sakshi
Sakshi News home page

పెళ్లి వార్తలను కొట్టిపారేసిన హీరోయిన్‌

Published Tue, May 19 2020 5:38 PM | Last Updated on Tue, May 19 2020 5:43 PM

Varalaxmi Sarathkumar Rubbishes Wedding Rumours - Sakshi

మనసులో ఏం దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. తనపై వచ్చే రూమర్లపై కూడా అలాంటి సమధానాలే ఇస్తారు వరలక్ష్మి. ఈ ఫైర్‌బ్రాండ్‌ వివాహం గురించి ఫిలింనగర్‌లో ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి వరలక్ష్మి పెళ్లి ముచ్చట ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి ఓ బిజినెస్‌ మ్యాన్‌తో డేటింగ్‌ చేస్తుందని.. త్వరలోనే సినిమాలను వదిలేసి.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వరలక్ష్మి వివాహం చేసుకోబోయే వ్యక్తికి ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌తో సంబంధం ఉన్నట్లు  ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించారు వరలక్ష్మి. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అదేంటో నా పెళ్లి గురించి నాకే చివరగా తెలుస్తుంది. మళ్లీ అవే పుకార్లు. నా పెళ్లి గురించి ఎందుకు అందరికి ఇంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. ఆ వార్తను ఇంటి పైకెక్కి అరిచి మరి అందరికి చెప్తాను. అప్పుడు దీని గురించి వార్తలు రాయండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు.. సినిమాలు వదిలేయడం లేదు అంటూ ట్వీట్‌ చేశారు వరలక్ష్మి.(మిమ్మల్ని మీరు నమ్మండి)

అయితే ఇన్నాళ్లు మీడియాలో విశాల్‌ - వరలక్ష్మిల వివాహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ​ ఈ వార్తలను ఖండించేవారు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్‌లో విశాల్‌కు అనిశా రెడ్డితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.(విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement