‘సినిమాల్లోనే నటించాలా? వేరే పనులు లేవా?’ |  heroine shruti haasan fire on her marriage rumours | Sakshi
Sakshi News home page

‘సినిమాల్లోనే నటించాలా? నాకు వేరే పనులు లేవా?’

Published Tue, Feb 13 2018 5:59 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

 heroine shruti haasan fire on her marriage rumours - Sakshi

సాక్షి, చెన్నై: సినిమాల్లో నటించకపోతే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లేనా అంటూ సంచన నటి శ్రుతిహాసన్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యూటీ పెళ్లిపై ఇటీవల చాలానే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రుతిని తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రుతి అనూహ్యంగా నటనకు దూరం అయితే ఎవరికైనా ఏమైందనే ప్రశ్న తలెత్తడం సహజమే. అంతేకాక లండన్‌కు చెందిన బాయ్‌ఫ్రెండ్‌ మైఖైల్‌తో విందులు, విహారాలకు తిరిగారు. అందుచేత పెళ్లికి లగ్నం పెట్టేసుకుంటున్నా రేమోనన్న అనుమానం రాకమానదు. 

వరించిన అవకాశాన్ని కాలదన్నడం..
సంఘమిత్రలో కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడంతో శ్రుతి నట జీవితంపై రకరకాల ప్రచారానికి ఆస్కారం కలుగుతోంది. అయితే ఏ విషయంలోనైనా చాలా బోల్డ్‌గా వ్యవహరించే శ్రుతిహాసన్‌ తనపై వస్తున్న వదంతులపై కాస్త ఘాటుగానే స్పందించారు. 

వదంతులపై శ్రుతి ఫైర్‌..
వదంతులపై శుత్రి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నా వివాహాన్ని, సినిమాను కలిసి మాట్లాడకండి. వెండితెరపై మిమ్మల్ని చాలా కాలంగా చూడలేకపోతున్నామే, సినిమాలను వదిలేశారా ?  అని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్లోనే నటించాలా ? నాకు వేరే పనులు లేవా? నా జీవితం సినిమాలతో పాటు పలు విషయాలతో ముడిపడి ఉంది. శ్రుతి పెళ్లికి సిద్ధం అవుతున్నారు వంటి ప్రచారాన్ని చేయకండి. నాకు సంగీత పరిజ్ఞానం ఉంది.  అదే విధంగా నటన మాత్రమే కాక నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని’ ఆమె తెలిపారు.

హీరోయిన్‌ అవుతానని ఊహించనేలేదు..
అంతేకాక హీరోయిన్‌ కావడంపై కూడా ఆమె స్పందించారు. ’ నిజం చెప్పాలంటే నేను హీరోయిన్‌ అవుతానని ఊహించనేలేదు. అవకాశం వచ్చింది చేసి చూద్దాం అని భావించాను. ఆ తర్వాత అదే దారిలో ఉన్నత స్థాయికి ఎదిగాను. ఆ స్థాయిని నిలదొక్కుకున్నాను. ఇప్పుడు మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసు ఏం చెబుతుందో అదే చేస్తాను. నటనతో పాటు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు లభించిన సమయాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను’ అని శ్రుతి హాసన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement