నాకదే ఇష్టం.. ఏ పని పెట్టుకోను: నటి | Anushka shetty acts with Malayalam Super Star Mammootty | Sakshi
Sakshi News home page

నాకదే ఇష్టం.. ఏ పని పెట్టుకోను: నటి

Published Thu, Apr 5 2018 9:16 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Anushka shetty acts with Malayalam Super Star Mammootty - Sakshi

హీరోయిన్‌ అనుష్క

సాక్షి, చెన్నై: హీరోయిన్‌ అనుష్క నటించిన భాగమతి చిత్రం మంచి విజయం సాధించింది. అందంతో రంజింపజేయాలన్నా.. వీరనారిగా కత్తి పట్టి రణరంగంలో కదం తొక్కాలన్నా ఈ స్వీటికే చెల్లుతుంది. తాజాగా మాలీవుడ్‌లోకి ఈ ముద్దుగుమ్మ అగుడు పెట్టనుంది. సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో ఆమె జత కట్టనున్నారు. ఆ సినిమాలో నటించడానికి నటి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి గాసిప్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా బ్యూటీ ఇచ్చిన బేటి చూద్దాం. ‘ఏ రంగం వారికైనా తమ విరామ సమయాన్ని ఏ విధంగా గడపాలో ఒక ప్రణాళిక ఉంటుంది. కొందరు ఫ్యామిలీతో, మరికొందరు స్నేహితులతో గడపాలని కోరుకుంటారు. అంతేకాక వారితో కలిసి బయట ప్రపంచంలో ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది. నేను మాత్రం విరామం లభిస్తే ఏకాంతాన్ని కోరుకుంటాను. అదంటే నాకు చాలా ఇష్టం. విరామం దొరికితే ఏ పని పనెట్టుకోను. షూటింగ్‌ సమయంలో మన గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. 24 గంటలూ కథా పాత్రలోనే జీవించాల్సి ఉంటుంది. అలా ఏ మాత్రం విరామం లభించినా ఏకాంతంగా కూర్చుని నా గురించి నేను ఆలోచించుకుంటాను. నాలో నేనే మాట్లాడుకుంటాను. ఏకాంతంగా ఆలోచించే సమయంలో ఏదైనా తప్పు చేస్తే దాన్ని గ్రహించుకునే అవకాశం, సరిదిద్దుకునే మార్గం తెలుస్తోంది’ అని నటి అనుష్క పేర్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement