భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం విదేశాల్లో జరగనుందట. ఇప్పటికే ఆ లోకేషన్లు కూడా ఫైనల్ చేశారు. వీటిలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మైనస్ డిగ్రీలలో ఉంటుందని, అంత చలిలో కూడా షూటింగ్ చేసేందుక అనుష్క అంగీకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సైలెన్స్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment