వ్యాపారితో ప్రేమేంటి? | Colours Swathi reacts on Marriage Rumours | Sakshi
Sakshi News home page

వ్యాపారితో ప్రేమేంటి?

Published Mon, May 26 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

వ్యాపారితో ప్రేమేంటి?

వ్యాపారితో ప్రేమేంటి?

నటి స్వాతి చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తున్నారని, వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఈ ఏడాది చివరిలో ఏడడుగులకు ముహూర్తం కుదిరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్‌లో కలర్స్ స్వాతిగా ప్రాచుర్యం పొందిన ఈ తెలుగమ్మాయి తమిళంలో యువ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. తాజాగా మాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసిన ఈ బహుభాషా నటికి కల్యాణ ఘడియలు దగ్గర పడినట్లు సమాచారం. తమిళంలో సుబ్రమణిపురం చిత్రం ద్వారా పరిచయమై స్వాతి ప్రస్తుతం వడకర్రి చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి అడగ్గా అదంతా అసత్యప్రచారం అంటూ కొట్టేశారు.

ఇలాంటి నిరాధార వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారో గానీ తానెవరినీ ప్రేమించలేదని స్పష్టం చేశారు. అసలు తాను ఈ మధ్య కాలంలో చెన్నైకి రాలేదన్నారు. మూడు నెలల క్రితం వడకర్రి చిత్ర షూటింగ్ కోసం చెన్నై వచ్చానని చెప్పారు. అయితే ఇలాంటి వదంతులు ఇంతకు ముందు కూడా ప్రచారం అయ్యాయని, తాను చెన్నైకి వచ్చిన ప్రతి సారి ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం షూటింగ్ నిమిత్తమే చెన్నైకి వస్తానన్నారు. షూటింగ్‌లో పాల్గొంటే నటనపైనే తన పోకడ ఉంటుందన్నారు. ఒక వేళ ఏదైనా షాపింగ్ చెయ్యాలనుకుంటే యూనిట్‌లోని మిత్రులతో కలిసే వెళతానన్నారు. అలాంటిది ఎవరో ప్రచారం చేస్తున్నట్లు ఆ వ్యాపారవేత్తను కలుసుకునే అవకాశమెక్కడుంటుందని స్వాతి ఆవేశంగా  ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement