Actress Colors Swati Made a Splash at Secunderabad Railway Station - Sakshi
Sakshi News home page

Colours Swathi: హీరోయిన్ బుర్ఖా వీడియో.. కారణం అదేనా?

Published Mon, Jul 24 2023 1:20 PM | Last Updated on Mon, Jul 24 2023 2:04 PM

Actress Colours Swathi Burkha Video Divorce Rumours - Sakshi

హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి ఈ మధ్య ఓ రూమర్ వచ్చింది. భర్త నుంచి విడాకులు తీసుకుందని మాట్లాడుకున్నారు. అందుకు తగ్గట్లే తన ఇన్‌స్టా నుంచి ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడం పలు సందేహాలు రేకెత్తించింది. సరే ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఈ భామ.. ఇప్పుడు సడన్‌గా బుర్ఖాలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్)

బుర్ఖా అందుకేనా
ఈ వీడియోలో కలర్స్ స్వాతి.. ఎక్కడికో ప్రయాణమవుతూ కనిపించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుర్ఖా ధరించి అటు ఇటు తిరుగుతూ సందడి చేసింది. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసమే చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత బుర్ఖా తీసేసి నార్మల్‌గానే కనిపించింది. ఆ తర్వాత చీరకట్టు, ఫిల్టర్ ఛాయ్ విజువల్స్‌తో వీడియోని ఎండ్ చేసింది. విడాకుల రూమర్స్ దృష్ట్యా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

రిలీజ్‌కి సినిమాలు రెడీ
స్వాతి సినీ కెరీర్ చూసుకుంటే.. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. అయితే తెలుగులో ఈమె పలు మూవీస్ చేసినా అవి హిట్ కాకపోవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది 'పంచతంత్రం' మూవీ చేసింది. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్‌తో 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇవి విడుదల కావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement