Actress Colours Swathi Clarified Divorce Rumours - Sakshi
Sakshi News home page

Colours Swathi: డివోర్స్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

Jul 25 2023 6:40 PM | Updated on Jul 25 2023 6:45 PM

Actress Colours Swathi Clarify Divorce Rumours - Sakshi

నటీనటులు ఎవరైనా విడాకులు తీసుకుంటే ఒకప్పుడు అంతా అయిపోయాక తెలిసేది. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేస్తే నెటిజన్స్ త్వరలో డివోర్స్ కన్ఫర్మ్ అని ఫిక్సయిపోతున్నారు. కలర్స్ స్వాతి కూడా ఇలా ఫొటోలు తొలగించేసరికి ఆమె కూడా విడాకులు తీసుకోనుందనే న్యూస్ వైరల్ అయింది. కొన్ని రోజుల నుంచి ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి!)

తెలుగమ్మాయి అయిన స్వాతి.. 'సుబ్రహ్మణ్యపురం' అనే తమిళ మూవీతో హీరోయిన్‌ అయిపోయింది. 'అష్టాచమ్మా' తెలుగులోనూ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ నిఖిల్ తో ఈమె చేసిన 'స్వామిరారా', 'కార్తికేయ' మాత్రమే చెప్పుకోదగ్గ హిట్స్‌గా నిలిచాయి. ఫామ్‌లో ఉండగానే వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఫారెన్ వెళ్లిపోయింది.

గతేడాది 'పంచతంత్రం' అనే తెలుగు మూవీతో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతోపాటు 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ చేస్తోంది. సరే ఇది పక్కనబెడితే విడాకుల రూమర్స్ నిజమేనా కాదా అని స్వాతిని ఓ ప‍్రముఖ మీడియా హౌస్ సంప్రదించగా.. 'చెప్పడానికి ఏం లేదు, అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను' అని మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం. 2020లోనూ ఫొటోలు డిలీట్ చేసినప్పుడు ఇలా వదంతలు వచ్చాయి. కానీ వాటిని ఆర్కైవ్‌లో దాచినట్లు క్లారిటీ ఇచ్చింది. 

(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement