Actress Colors Swathi Shared Childhood Pic In Instagram Goes Viral - Sakshi
Sakshi News home page

Guess The Heroine: ఈ మధ్య న్యూస్‌ అంతా ఈమెనే.. ఎవరో కనిపెట్టారా?

Published Tue, Jul 25 2023 5:10 PM | Last Updated on Tue, Jul 25 2023 5:42 PM

Actress Colours Swathi Childhood Pic  - Sakshi

సాధారణంగా తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే ఆ కామెంట్స్‌ని బ్రేక్ చేసిన బ్యూటీస్‌లో పైన కనిపిస్తున్న ఆమె కూడా ఒకరు. ఎందుకంటే తమిళంలో ఫస్ట్ హిట్ కొట్టి, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఈ మధ్య న్యూస్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరామె?

(ఇదీ చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు)

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు స్వాతి రెడ్డి. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. కలర్స్ స్వాతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తండ్రి నేవీ అధికారి కావడంతో ఆయన రష్యాలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ పుట్టింది. పాపకు స్వెత్లానా అని పేరు పెట్టారు. కొన్నాళ్లకు స్వాతి అని మార్చేశారు. చిన్నతనంలో తొలుత ముంబయిలో ఉన్న స్వాతి ఫ్యామీలీ ఆ తర్వాత వైజాగ్‌కి షిఫ్ట్ అయిపోయారు. 

ఇక ఇంటర్మీడియట్ చదివేందుకు హైదరాబాద్ వచ్చిన స్వాతి.. టీనేజ్ లో ఉండగానే 'కలర్స్' అనే ప్రోగ్రాంలో యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలా కలర్స్ స్వాతిగా క్రేజ్ సంపాదించింది. తొలుత కృష్ణవంశీ తీసిన 'డేంజర్' మూవీలో నటించింది. వెంకీ-త్రిష 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులో' చిన్న రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. 

(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)

తమిళ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'తో హీరోయిన్  అయిపోయిన స్వాతి.. తెలుగులో 'అష్టాచమ్మా'తో హీరోయిన్ గా అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. మంచి ఫామ్ లో ఉండగానే వికాస్ అనే వ‍్యక్తిని పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిలైపోయింది. గతేడాది 'పంచతంత్రం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' మూవీ, 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ తో బిజీగా ఉంది. 

ఇకపోతే స్వాతి విడాకులు తీసుకోనుందనే వార్త కొన్నిరోజుల ముందు తెగ వైరల్ అయింది. ఆమె ఇన్ స్టాలో భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమే ఈ సందేహం రావడానికి కారణం. తాజాగా బుర‍్ఖాతో కనిపించి తెగ సందడి చేసింది. ఇలా గత కొన్నిరోజుల నుంచి న్యూస్ లో ఉన్న స్వాతి చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. దీంతో ఆ ఫొటోని గుర్తుపట్టిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement