
ఒకప్పుడు మందు తాగడం అంటే ఏదో పెద్ద తప్పులా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలైతే ఈ విషయంలో బయటపడరు. ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తనకు తాగే అలవాటుందని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)
సంయుక్త మీనన్ మలయాళీ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ తండ్రి నుంచి విడిపోయిన తర్వాత మీనన్ అనే ఇంటి పేరు తొలగించుకుంది.
ట్రావెలింగ్ అంటే పిచ్చి. షూటింగ్ రీత్యా రకరకాల ప్రదేశాలు తిరిగినా, పర్సనల్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తుంటుంది. ఈ ప్రయాణాల్లో ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటుంది. కుంభమేళాకు కూడా వెళ్లి పవిత్ర స్నానాలు చేసి వచ్చింది.
సంయుక్త మంచి ఫుడ్ లవర్ . కేరళ స్టయిల్ వంటకాలంటే ప్రాణం. సినిమాల్లో కూడా ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలు తెలియ చేసే సినిమాలు రావాలంటుంది.
తెలుగులో ఉలవచారు బిర్యానీ సినిమా వచ్చిందిగా అంటే.. అది మలయాళ పెప్పర్ సాల్ట్ సినిమా రీమేకేగా అంటుంది.
ఏ విషయం అయినా, బోల్డ్‌గా చెప్పేయడం సంయుక్త అలవాటు. తను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది. అయితే అన్ని పార్టీల్లో కాదు.. క్లోజ్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడేనని చెప్పింది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించినా, సెట్స్ బయట తెలుగు సినిమా పరిశ్రమ లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా.. మరే భాషా రంగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
కో –ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తోనే తను కూడా పోటీ పడి నటించగలనని, అవతల ఆర్టిస్టు డమ్మీ అయితే తను కూడా నీరు కారిపోతానని సంయుక్త చెప్పుకొచ్చింది. అందుకే విరూపాక్ష, సార్, బింబిసార లాంటి సినిమాలు అంత సూపర్ హిట్ అయ్యాయని చెప్పింది.
∙పుస్తకాల పురుగు. ఫిక్షన్ నవలలు ఎంత ఇష్టమో, భారతీయ సంస్కృతిని తెలియచేసే బుక్స్ అన్నా అంతే అభిమానం.నందమూరి బాలకృష్ణతో ఓ జ్యుయెలరీ యాడ్ లో యాక్ట్ చేసినప్పుడు – ఆయనతో నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకుందట. కానీ అఖండ–2లో ఆఫర్ వచ్చేటప్పటికీ ఆ ఎగ్జయిట్‌మెంట్ మాటల్లో వర్ణించలేను అంది.
తను చేయబోతున్న ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది.
(ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం)
Comments
Please login to add a commentAdd a comment