
మిల్కీ బ్యూటీ తమన్నా(ఫైల్ ఫోటో)
పెళ్లి వార్తలపై వరుసగా వస్తున్న రూమర్స్‌కు హీరోయిన్ తమన్నా చెక్ పెట్టారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌లో స్పందించారు. ‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్, ఇప్పుడేమో డాక్టర్.. నేనేమి భర్తల షాపింగ్ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నా పేరెంట్స్ కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం చట్ట ప్రకారం, గౌరవప్రదంగానూ మంచిది కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా’ అంటూ తమన్నా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment