సెలబ్రిటీల మరణాలు లేదా ప్రమాదాల గురించి తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం. బతికి ఉన్నవారిని కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చంపేస్తున్నారు. పలాన స్టార్ నటి రోడ్డు ప్రమాదంలో మరణించారు.. పలాన స్టార్ నటుడు హఠాత్తుగా మృతి చెందాడు ఇలా తప్పుడు వీడియోలు పెట్టి వ్యూస్ సంపాదించుకునే ప్రయత్నాలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగుతుంది.
తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో జరిగింది. బుల్లితెర ప్రముఖ నటి అయిన జిగ్యాసా సింగ్ మరణించారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పుకార్లు రేపాయి. తాప్కీ ప్యార్‌కి అనే సీరియల్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అలా ఆమె అందరికీ దగ్గరైంది. కానీ కొందరు షాకింగ్ న్యూస్..! 'ప్రముఖ నటి జిగ్యాసా సింగ్ మరణించారు. తప్కీ ప్యార్‌కీ నటి మరణించింది. నటి జిగ్యాసా సింగ్ అంతిమయాత్ర' వంటి తప్పుడు థంబ్‌నైల్స్‌తో వీడియోలు పోస్ట్ చేశారు. అవి ఆమె కంట పడ్డాయి. దీంతో వాటిని స్క్రీన్ షాట్ తీసుకున్న ఈ బ్యూటీ తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిపై ఫైర్ అయింది.
(ఇదీ చదవండి: నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్)
ఆ వార్తలపై నటి స్పందిస్తూ..ఈ వీడియోలు ఫేక్ న్యూస్ అని తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులకు మానవత్వం అనేది లేదా అని ప్రశ్నించింది. నేను బతికే ఉన్నాను.. నకిలీ ఛానెల్స్‌లలో ఈ నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి. ఇలాంటి తప్పుడు వీడియోల ద్వారా వచ్చిన డబ్బుతో ఎవరూ సుఖంగా జీవించలేరు. ప్రాణాలతో ఉన్నవారిని ఇలా హింసించడం న్యాయం అనిపిస్తుందా అని ఆమె ఫైర్ అయింది.
ఇలాంటి ప్రచారం ఎందుకు చేశారంటే
జిగ్యాసా సింగ్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దీంతో పలు యూట్యూబ్ ఛానల్స్ వారు తప్పుడు వార్తలు క్రియేట్ చేయడంతో ఆమె తిరిగి వెలుగులోకి తెచ్చింది. ఆమె కారు ప్రమాదంలో చనిపోయిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ వీడియోలు క్రియేట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా అంతిమ నివాళులర్పించారు. 'రెస్ట్ ఇన్ పీస్', 'RIP జిగ్యాస, ఓం శాంతి ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment