బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే ఇవాళ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని బాలగంధర్వ్ ఆడిటోరియంలో ఉంచనున్నారు. కొద్ది రోజులుగా ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి.
(చదవండి: నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం)
అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానా (1971)లో విక్రమ్ గోఖలే హిందీ చిత్రాలలో అడుగుపెట్టారు. 40 ఏళ్లకు పైగా సాగిన కెరీర్‌లో పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అగ్నిపత్ (1990), హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), భూల్ భూలైయా (2007), నటసామ్రాట్ (2015), హిచ్కీ (2018), మిషన్ మంగళ్ (2019) ప్రాముఖ్యత సాధించారు. 2010లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మరాఠీ చిత్రం ఆఘాత్‌తో దర్శకుడిగా మారారు. అతను చివరిగా శిల్పా శెట్టి, అభిమన్యు దాసానితో కలిసి నికమ్మలో కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment