Vikram Gokhale
-
మరో విషాదం.. చికిత్స పొందుతూ సీనియర్ నటుడు మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే ఇవాళ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని బాలగంధర్వ్ ఆడిటోరియంలో ఉంచనున్నారు. కొద్ది రోజులుగా ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. (చదవండి: నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం) అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానా (1971)లో విక్రమ్ గోఖలే హిందీ చిత్రాలలో అడుగుపెట్టారు. 40 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అగ్నిపత్ (1990), హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), భూల్ భూలైయా (2007), నటసామ్రాట్ (2015), హిచ్కీ (2018), మిషన్ మంగళ్ (2019) ప్రాముఖ్యత సాధించారు. 2010లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మరాఠీ చిత్రం ఆఘాత్‌తో దర్శకుడిగా మారారు. అతను చివరిగా శిల్పా శెట్టి, అభిమన్యు దాసానితో కలిసి నికమ్మలో కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. -
నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతిచెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని, అయితే పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. నిన్న సాయంత్రం కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి అంటూ అని గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. అయితే అప్పటికే మీడియాలో, వెబ్సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. ఈ క్రమంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో ఆయన కనిపించారు. Prayers for Vikram Gokhale who has slipped into a Coma and is still very very critical according to his wife 🙏 #VikramGokhale — Sᴜᴢᴀɴɴᴇ Bᴇʀɴᴇʀᴛ (@suzannebernert) November 24, 2022