
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.
సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.
కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment