‘గుర్తుందా శీతాకాలం’ చూస్తే మనందరి లవ్‌స్టోరీస్‌ గుర్తొస్తాయి: కావ్య శెట్టి | Kavya Shetty Talk About Gurthunda Seethakalam Movie | Sakshi
Sakshi News home page

‘గుర్తుందా శీతాకాలం’ మీ హార్ట్‌ని టచ్‌ చేస్తుంది: హీరోయిన్ కావ్య శెట్టి

Published Tue, Nov 29 2022 4:25 PM | Last Updated on Tue, Nov 29 2022 4:27 PM

Kavya Shetty Talk About Gurthunda Seethakalam Movie - Sakshi

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా,  కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు న‌టించిన  సినిమా 'గుర్తుందా శీతాకాలం.  క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్,  మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా  నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ కావ్యశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

మాది కన్నడ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్ గా కన్నడలో  నేను నటించిన లవ్ మాక్టేల్   సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు అడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. అలాగే  మలయాళం లో ఒకటి, తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. అయితే తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం.

 మూడు ల‌వ్ స్టోరీస్ (త్రీ ఏజ్ గ్రూప్స్) క‌లిపిన ఒక మంచి ల‌వ్ స్టోరినే ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూడు లవ్‌ స్టోరిస్‌  మీ హ‌ర్ట్ ని ట‌చ్ చేసేలా ఉంటాయి. ఇందులో  నేను కాలేజీ గర్ల్ అమ్ములు పాత్ర‌లో న‌వ్విస్తాను.. కాలేజ్ నేపథ్యం లో సాగే నా పాత్ర  మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ మెంట్ నిస్తుంది .

నేను డి గ్లామర్ పాత్రలో ఒక సినిమా చేశాను కానీ నాకు గ్లామర్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే "గుర్తుందా శీతాకాలం"’ మాత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఎక్సటింగ్ గా ఉన్నాను. 

నా కో స్టార్ సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో నాకున్న  డైలాగ్స్ కు ఎక్కువగా తనే హెల్ప్ చేశాడు. తనతో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. తమన్నా తో నాకు ఎటువంటి సీన్స్ లేవు, కానీ ప్రియదర్శి తో సీన్స్  ఉన్నాయి.  కాల‌భైర‌వ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి.

కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయిన నిర్మాతలు రామారావు చింతపల్లి, భావ‌న ర‌వి, నాగ శేఖర్,  వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు లలో మంచి మంచి లొకేషన్స్ లలో షూట్ చేశారు. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో  నటించే  అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నా..

కన్నడ నుండి వచ్చిన హీరోయిన్స్ అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టి వంటి వారందరినీ అదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. వారిని ఆదరించినట్లే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత  నెక్స్ట్ మూడు కన్నడ సినిమాలు , ఆమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇంకా కొన్ని లైనప్ లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement