Satyadev, Tamannaah Bhatia Gurthunda Seethakalam Trailer Review - Sakshi
Sakshi News home page

Gurtunda Seetakalam: గుర్తుందా శీతాకాలం ట్రైలర్‌ చూశారా?

Published Mon, Feb 14 2022 1:05 PM | Last Updated on Mon, Feb 14 2022 6:45 PM

Satyadev, Tamannaah Bhatia Gurthunda Seethakalam Trailer Review - Sakshi

వాలంటైన్స్‌ డే సందర్భంగా స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చింది 'గుర్తుందా శీతాకాలం' యూనిట్‌. సత్యదేవ్‌, తమన్నా భాటియా హీరోహరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి సోమవారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. 'శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..' అంటూ ట్రైలర్‌ మొదలైంది. కోమలి, అమ్ము, దివ్య.. ఇలా చాలామందినే ప్రేమించాడు హీరో. చివరగా నిధి.. ఆమెతో ప్రేమలో పడలేదంటూనే ఇద్దరి మధ్య లవ్‌ స్టోరీని చూపించాడు డైరెక్టర్‌.

మరి ఆ అమ్మాయిల్లో హీరో కరెక్ట్‌ పార్ట్‌నర్‌ ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించగా భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్‌.ఎస్‌. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సంపత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నవీన్‌ రెడ్డి, రాఘవ సూర్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement