Kavya Shetty
-
Gurthunda Seethakalam Trailer: మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా..
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేం. అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ‘లవ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే..’, మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా’ లాంటి డైలాగ్స్ ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. -
‘గుర్తుందా శీతాకాలం’ చూస్తే మనందరి లవ్‌స్టోరీస్ గుర్తొస్తాయి: కావ్య శెట్టి
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది కన్నడ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్ గా కన్నడలో నేను నటించిన లవ్ మాక్టేల్ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు అడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. అలాగే మలయాళం లో ఒకటి, తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. అయితే తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం. ► మూడు లవ్ స్టోరీస్ (త్రీ ఏజ్ గ్రూప్స్) కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూడు లవ్ స్టోరిస్ మీ హర్ట్ ని టచ్ చేసేలా ఉంటాయి. ఇందులో నేను కాలేజీ గర్ల్ అమ్ములు పాత్రలో నవ్విస్తాను.. కాలేజ్ నేపథ్యం లో సాగే నా పాత్ర మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ మెంట్ నిస్తుంది . ► నేను డి గ్లామర్ పాత్రలో ఒక సినిమా చేశాను కానీ నాకు గ్లామర్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే "గుర్తుందా శీతాకాలం"’ మాత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఎక్సటింగ్ గా ఉన్నాను. ► నా కో స్టార్ సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో నాకున్న డైలాగ్స్ కు ఎక్కువగా తనే హెల్ప్ చేశాడు. తనతో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. తమన్నా తో నాకు ఎటువంటి సీన్స్ లేవు, కానీ ప్రియదర్శి తో సీన్స్ ఉన్నాయి. కాలభైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి. ► కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయిన నిర్మాతలు రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు లలో మంచి మంచి లొకేషన్స్ లలో షూట్ చేశారు. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.. ► కన్నడ నుండి వచ్చిన హీరోయిన్స్ అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టి వంటి వారందరినీ అదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. వారిని ఆదరించినట్లే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూడు కన్నడ సినిమాలు , ఆమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇంకా కొన్ని లైనప్ లో ఉన్నాయి. -
శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!
తెలుగులో ఎప్పుడూ ముంబయ్ భామలదే హవా. ఆ తర్వాత మలయాళ బ్యూటీలది. బెంగళూరు భామలు ఇక్కడ తక్కువే. అప్పట్లో సౌందర్య ఓ వెలుగు వెలిగారు. తర్వాత అనుష్క కూడా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. ఇలా అప్పుడప్పుడూ ఒకరిద్దరు వస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కన్నడ భామలు అరడజను పైనే తెలుగుకి వచ్చారు శాండల్‌వుడ్ నుంచి వచ్చిన చందన పరిమళాలు రష్మికా మందన్నా, నభా నటేశ్, కృతీ శెట్టి, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, రచితా రామ్, కావ్యా శెట్టి చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రష్మికా మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దక్కిన చాన్స్ రష్మిక కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మికాయే హీరోయిన్. తెలుగులో ఆమె సంపాదించుకున్న క్రేజ్ బాలీవుడ్ వరకు చేరింది. హిందీలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ (అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, మరో సినిమా ప్రకటన త్వరలో రానుంది) రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకోవడం ఏ కొందరికో కుదురుతుంది. కృతీ శెట్టి ఈ కోవలోకే వస్తారు. ‘ఉప్పెన’ ద్వారా పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందే నానీతో ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్న కృతి ఇటీవల రామ్ కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యారు. మరో తెలుగు సినిమాకు కూడా కృతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు కృతీ శెట్టి. మరోవైపు కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీ లీల. అలాVó హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీ లీలయే కథానాయిక. సేమ్ కృతీ శెట్టి మాదిరిగానే తెలుగులో తనది ఒక్క సినిమా విడుదల కాకుండానే శ్రీ లీల రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. ఇక హైదరాబాద్‌లో పుట్టి నప్పటికీ బెంగళూరులోనే పెరిగారు కథానాయిక నభా నటేష్. ఆమె మాతృభాష కన్నడ. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ నభా ఖాతాలో ఉంది. ప్రస్తుతం నితిన్ ‘మ్యాస్ట్రో’ (హిందీ చిత్రం ‘అంధాధున్’ తెలుగు రీమేక్)లో నభా నటేష్ హీరోయిన్. జాతీయ అవార్డు సాధించిన నాని ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కొత్త అయినప్పటికీ రచితా రామ్ శాండల్‌వుడ్‌లో పాపులర్ హీరోయిన్. ‘సూపర్ మచ్చి’తో ఆమె తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఇందులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరో. కన్నడంలో మంచి ఫామ్‌లో ఉన్న మరో బ్యూటీ కావ్యా శెట్టి కన్నడ హిట్ ‘లవ్ మాక్ౖటైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా.. శీతాకాలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్. చూశారుగా.. ఇప్పుడు తెలుగులో చందన పరిమళం ఎక్కువగా వీస్తోంది. శాండల్‌వుడ్ నుంచి ఇంకెంతమంది కథానాయికలు వస్తారో చూడాలి. -
తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే. నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. -
థ్రిల్‌కి గురి చేస్తుంది!
నవదీప్ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘నటుడు’. కావ్యాశెట్టి కథానాయిక. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ‘‘కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ‘దృశ్యం’, ‘గీతాంజలి’ చిత్రాల విజయాలే నిదర్శనాలు. మా సినిమా కూడా వాటి కోవకే చెందుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ... ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసే సినిమా ఇది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మానవసంబంధాలతో ఆడుకునే యువకుని కథ ఇదని, నవదీప్‌ని కొత్తగా ప్రెజెంట్ చేయడం జరిగిందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: జయసూర్య, సమర్పణ: కొప్పుల రాజేశ్వరీదేవి.