తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా చిన్న సినిమాలు విజయవంతం అవుతుండటంతో పరిశ్రమ మొత్తం సందడి సందడి మారిపోయింది. చిన్న నిర్మాతల్లో ఎక్కడలేని ధైర్యం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆడియెన్స్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చూస్తారన్నారు. ఆ తర్వాత మాస్ మూవీస్ చూసేందుకు వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత అస్సలు ఆడియెన్స్ రావడం లేదన్నారు. కానీ కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ నిరూపించాయి.
(చదవండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ)
ఈ మూడు చిత్రాల ఘన విజయం..చిన్న చిత్రాలకు గొప్ప ధైర్యాన్ని అందించింది. అందుకే సెప్టెంబర్ లో వరుస పెట్టి చిన్న సినిమాలు థియేటర్స్ కు క్యూ కట్టాయి. సెప్టెంబర్ 2న ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 9న సత్యదేవ్, తమన్నాల ‘గుర్తుందా సీతా కాలం’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
(చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..)
ఈ మూడు చిత్రాలపై మంచి బజ్ ఉంది. సెప్టెంబర్ మూడో వారంలో నిఖిల్ కొత్త చిత్రం ‘18 పేజెస్’ రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 16 ‘శాకిని డాకిని’ విడుదలకు ముస్తాబవుతోంది. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కు అఫీసియల్ రీమేక్ గా తెరకెక్కింది శాకిని ఢాకిని. ఈ సినిమాకు పోటీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి, అల్లూరి రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎన్ని, ప్రేక్షకులను అలరిస్తాయో, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుతాయో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment