Ranga Ranga Vaibhavanga Movie
-
అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే..
‘ఉప్పెన’తో యూత్ ఆడియన్స్ ఆకట్టుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపోలం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాతో తొలి ఫ్లాప్‌ని చూసిన వైష్ణవ్ కాస్తా గ్యాప్ తీసుకుని రంగ రంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గిరీశాయ దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. రిలీజ్‌కు ముందు ట్రైలర్, పాటలతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల అనంతరం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. రోటిన్ కథాంశంతో ఉండటంతో బాక్సాఫీసు డీలా పడింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవ్, కేతిక శర్మల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ ఇది సినిమాకు ప్లస్ కాలేకపోయింది. ఫలితంగా వైష్ణవ్ రెండో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది ఈ చిత్రం. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో పూరి రోల్ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన చిరు ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రంగ రంగ వైభవంగా మూవీని దసరా పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ 5న లేదా అక్టోబర్ 7 నుంచి ఈ మూవీ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇక త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందట. #Dasara will have grand PAN INDIA release like #Pushpa.#RangaRangaVaibhavanga will premiere on Netflix on October 7th in Telugu.#SaakiniDaakini and #LifeOfMuthu still in trouble to enter into profit zone in Tollywood Boxoffice.#KartiKeya2 OTT update 🔜. pic.twitter.com/SyCRc66xbK — STREAMING UPDATES OTT (@newottupdates) September 21, 2022 -
రంగ రంగ వైభవంగా సినిమా పబ్లిక్ టాక్
-
Ranga Ranga Vaibhavamga Review: 'రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగరంగ వైభవంగా నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, సత్య తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: గిరీశాయ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: శామ్ దత్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 తొలి సినిమా ‘ఉప్పెన’తోనే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా వెండితెరపై కనిపించాడు. అయితే రెండో సినిమా ‘కొండపొలం’మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న వైష్ణవ్.. ఇప్పుడు ‘రంగరంగ వైభవంగా’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగరంగ వైభవంగా’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. కానీ రిషీ, రాధలకి మాత్రం ఒకరంటే ఒకరు పడదు. తరచూ గొడవ పడుతుంటారు. వీరి వయసుతో పాటు గొడవలు కూడా పెరుగుతూనే వస్తాయి. పెద్దయ్యాక వీరిద్దరు ఓ మెడికల్ కాలేజీలో చేరతారు. అక్కడ కూడా వీరిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అయితే రిషీకి మాత్రం రాధపై అమితమైన ప్రేమ ఉంటుంది కానీ.. పైకి కోపంగా ఉంటాడు. వీరిద్దరు కలిసే సమయానికి ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. అసలు ఆ గొడవలకు కారణం ఏంటి? తమ కుటుంబాలను కలపడం కోసం రిషీ, రాధలు ఏం చేశారు? చివరకు రిషీ, రాధల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా 'రంగ రంగ వైభవంగా' తెరకెక్కించారు. వైష్ణవ్, కేతికా శర్మ పాత్రల చైల్డ్‌హుడ్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతోంది. మెడికల్ స్టూడెంట్స్‌గా వైష్ణవ్, కేతికా శర్మలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కథంతా సరదాగా సాగుతుంది. రిషీ, రాధల మధ్య వచ్చే క్యూట్ ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సత్యతో వచ్చే సీన్స్ కూడా నవ్వులు పూయిస్తుంది. కావాల్సిన కామెడీ ఉన్నప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగడం మైనస్. ఇక సెకండాఫ్‌లో మాత్రం కథంతా సింపుల్ గా సాగుతుంది. మెడికల్ క్యాంపులో భాగంగా హీరో హీరోయిన్లు గ్రామానికి వెళ్ళడం..అక్కడ మళ్ళీ ఇద్దరు కలవడం, తమ ఫ్యామిలీలను కలిపేందుకు ప్లాన్ చేయడం..ఇలా రొటీన్ గా సాగుతుంది. సర్పంచ్ సత్తిబాబుగా సత్య చేసే కామెడీ నవ్వులు పుయిస్తుంది.అలానే కార్తీక దీపం సీరియల్ సీన్‌తో ఇద్దరి తల్లులను కలపడం ఆకట్టుకుంటుంది. ఎన్నికల సీన్ సాగదితగా ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గతంలో వేరే సినిమాలను గుర్తు చేసేలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ బావున్నా దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ పండకపోవడం, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయి. ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, నవీన్ చంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ఇదొక రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. -
‘రంగరంగ వైభవంగా’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్.`అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రంపై వైష్ణవ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన కొండపొలం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రంగరంగ వైభవంగా’ కథేంటి? సినిమా ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. నెటిజన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. రంగరంగ వైభవంగా మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #RangaRangaVaibhavanga getting Below Average Reviews from the USA Premiere Shows 🇺🇲 — VCD (@VCDtweets) September 2, 2022 ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. క్లీన్ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుందట. అయితే ఊహకందేలా సినిమా సాగడంతో ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలించదని చెబుతున్నారు. సత్యతో కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్ కాస్త బెటర్అని అంటున్నారు. ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా యావరేజ్ సినిమా అని చెబుతున్నారు. నెట్టింట కూడా ఈ సినిమాకు ఎక్కువగా బజ్ లేకపోవడం గమనార్హం. #RangaRangaVaibhavanga from USA Started with a Mediocre Outdated Story With a Vexing screenplay🤦🏻♂️🤦🏻♂️, Turned to Lackluster TV serial with Ultra bad Dialouges, poor editing👎🏻 and Jump cuts. Only good is Music, Camera and Satya Comedy. #PanjaVaisshnavTej pic.twitter.com/CdsxynAxbC — Pradyumna Reddy (@pradyumna257) September 2, 2022 ఇక వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం విడుదలైన సందర్భంగా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్‌తో పాటు పలువురు నటులు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. #Vaisshu babu wish you all the best for your release tomorrow 🤗😘 I know the love & effort that has gone into this film. Wishing good luck to the entire team of #RangaRangaVaibhavanga.@BvsnP Garu, Baapineedu Anna@TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial pic.twitter.com/U6qOETmVdS — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2022 My best wishes to the Vaishnav , @TheKetikaSharma , @GIREESAAYA and the entire team of #RangaRangaVaibhavamga Wishing you’ll a blockbuster!💯 pic.twitter.com/OLPuXYg813 — Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2022 -
ఆ సినిమా రీమేక్‌లో నటించాలని ఉంది
‘‘రంగ రంగ వైభవంగా’లో ఎంటర్టైన్మెంట్తో పాటు అందమైన ప్రేమకథ, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► నా సినిమా కథల ఎంపికలో ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ (వైష్ణవ్ అన్న) తో పాటు ఎవరి సపోర్ట్ తీసుకోను. నేనే ఎంచుకుంటున్నాను. గిరీశాయ కథ చెప్పిన విధానం, కథపై ఆయనకు ఉన్న నమ్మకం నచ్చింది. పైగా ఆయన మంచి అనుభవం ఉన్న దర్శకుడు. అందుకే ‘రంగ రంగ వైభవంగా’ చేశా. ► ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటీనటులున్నారు. సీనియర్స్‌తో నటించడం వల్ల వారి అనుభవం, అంకితభావం వంటి విషయాలు తెలుసుకున్నాను. నటన విషయంలో మెగా ఫ్యామిలీలోని అందరి నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. ► బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి లాంటి సీనియర్ నిర్మాత బేనర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనే మంచి టీమ్‌ని సెట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శ్యామ్దత్గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ► ‘ఉప్పెన’తో నాకు పెద్ద హిట్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ మేము అనుకున్నంతగా ఆడలేదు.. అందుకు ఎలాంటి బాధ లేదు. నా ప్రతి సినిమా రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉండాలనుకుంటాను. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) సినిమాలను నేను రీమేక్ చేయడమంటే సాహసమే. మంచి కథ కుదిరి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయగలిగితే ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది. ప్రస్తుతం సితార బ్యానర్లో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. -
రంగ రంగ వైభవంగా సినిమా చిట్ చాట్
-
హీరోగా వైష్ణవ్ తేజ్.. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్: సాయిధరమ్ తేజ్
‘‘రంగ రంగ వైభవంగా’ హిట్ అవుతుందా? బ్లాక్‌బస్టర్ అవుతుందా? అనేది నాకు తెలియదు. కానీ నా తమ్ముణ్ణి (వైష్ణవ్ తేజ్) మీరు(ప్రేక్షకులు) హీరోగా యాక్సెప్ట్ చేశారు. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మళ్లీ ఇలా స్టేజ్‌పైకి వస్తానని ఊహించలేదు. నేను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించడం వల్లే బతికాను. మీరు కూడా బైక్‌పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించండి. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ హిట్ అవడంతో ఆనందపడ్డాం. నా ‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో సెప్టెంబరు 10న నాకు బైక్ ప్రమాదం జరిగింది. హాస్పిటల్లో పడుకుని ఉన్నప్పుడు నా తమ్ముడు వచ్చి ‘అన్నా..’ అని నన్ను పిలిస్తే పలకలేకపోయాను(భావోద్వేగంతో..). ఆ సమయంలో అమ్మ, నాన్న, నా తమ్ముడు నాతో ఉన్నారు. వైష్ణవ్ నా పక్కన ఉంటే నాకు ధైర్యం. వీడు నా బలం. సెప్టెంబరు 2న నా గురువుగారి (పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ..) బర్త్ డే. ఈ సినిమా చూసి గరువుగారి బర్త్ డే చేసుకోండి’’ అన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘పెదనాన్న (చిరంజీవి), బాబాయ్(పవన్ కల్యాణ్) మాకు చెప్పింది ఒక్కటే.. ‘నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని’. మూడు సినిమాలు చేసినా వైష్ణవ్ తన కష్టాన్నే నమ్ముకున్నాడు’’ అన్నారు. ‘‘గిరిగారు కథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను’’ అన్నారు వైష్ణవ్‌తేజ్. ‘‘వైష్ణవ్‌గారు సెట్స్‌లో నాకు ఇచ్చిన రెస్పెక్ట్‌కి నా పదిహేనేళ్ల కష్టాన్ని మర్చిపోయాను’’ అన్నారు గిరీశాయ. ‘‘మెగా హీరోలతో నేను చేసిన సినిమాలన్నీ హిట్స్ సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. నటులు అలీ, నాగినీడు, కెమెరామేన్ శ్యామ్‌దత్ పాల్గొన్నారు. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్ట్ నెల మిశ్రమ ఫలితాన్ని అందించింది. గత కొన్ని రోజులుగా వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి కొత్త ఆశలు రేకెత్తించాయి. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. ఇక ఈ వారం.. అంటె సెప్టెంబర్ నెలారంభంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో అలరించడానికి పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కోబ్రా తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. రంగరంగ వైభవంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లెటెస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించారు.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుజ్జీ..ఇలారా.. సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. చాందినీ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెస్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ ద లార్డ్ ఆఫ్ రింగ్స్(వెబ్ సిరీస్ తెలుగు), సెప్టెంబర్ 2 విడుదల ఆహా పంచతంత్ర కథలు (తెలుగు), ఆగస్ట్ 31 పెళ్లి కూతురు పార్టీ (తెలుగు), ఆగస్ట్ 31 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కఠ్పుత్లీ(హిందీ), సెప్టెంబర్ 2 ఖుదా హఫీజ్ 2(హిందీ), సెప్టెంబర్ 2 సోనీలీవ్ సుందరి గార్డెన్స్(మలయాళం), సెప్టెంబర్ 03 జీ5 విక్రాంత్ రోణ(తెలుగు), సెప్టెంబర్ 2 నెట్‌ఫ్లిక్స్ ఐ కేమ్ బై (ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 ఫ్యామిలీ సీక్రెట్స్(వెబ్ సిరీస్), ఆగస్ట్ 31 అండర్ హర్ కంట్రోల్(ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 -
మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ
‘‘విభిన్నమైన వృత్తుల్లో (పాత్రల్లో) కనిపించగలిగే అవకాశం యాక్టర్స్‌కు మాత్రమే దక్కుతుంది. అందుకే నేను యాక్టర్‌ని అయినందుకు సంతోషంగా ఉంది. నా పేరెంట్స్, తాతగారు డాక్టర్స్. మా నాన్నగారు నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ నా ఇష్టం మేరకు నేను యాక్టర్‌ని అయ్యాను. అయితే ‘రంగ రంగ వైభవంగా..’ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ రాధగా నటించాను. అలా స్క్రీన్‌పై డాక్టర్‌గా కనిపించాను. ఈ విధంగా మా నాన్నగారి కల నిజం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేతికా శర్మ. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమా నాకో లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే.‘రొమాంటిక్’, ‘లక్ష్య’ చిత్రాలతో యూత్ ఆడియన్స్‌కు దగ్గరైన నేను ‘రంగరంగ వైభవంగా..’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర కానున్నందుకుసంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన రాధ పాత్రలో ప్రతి అమ్మాయి తనను తాను కొంచెం అయినా ఊహించుకుంటుంది’’ అన్నారు. -
తిరుపతిలో సందడి చేసిన రంగరంగ..వైభవంగా మూవీ టీమ్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ సందడి చేసింది. ఓ ప్రయివేటు హోటల్లో శుక్రవారం హీరో వైష్ణవతేజ్, హీరోయిన్ కృతికశర్మ, దర్శకుడు గిరిశాయ, నిర్మాత బీవీఎన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి నుంచి వైజాగ్ వరకు చిత్ర ఫ్రీ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, సెప్టెంబర్ 2న థియేటర్లలో సందడి చేస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: (Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ) -
తిరుపతిలో ‘రంగ రంగ వైభవంగా’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
ఆ సీన్ చేస్తున్నప్పుడు చిరు మామ నాపై సీరియస్ అయ్యారు: వైష్ణవ్
శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొండపొలంతో మరో హిట్ అందుకున్న వైష్ణవ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే మరో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. గిరీశయ్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ డైరెక్టర్ గిరీశయ్యాతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్ ఈ సందర్భందగా శంకర్ దాదాలో మీ పెద్ద మామయ్య(మెగాస్టార్ చిరంజీవి)తో కలిసి నటించావ్ కదా ఆయన నీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా? అని అడగ్గా.. ‘ఈ సినిమాలో నా పాత్ర అసలు కదలకూడదు, కల్లు అర్పకూడదు. అయితే ఒక సీన్లో బాగా నవ్వేశాను. దీంతో మామయ్య(చిరంజీవి) అప్పుడు కొంచ్ం సీరియస్ అయ్యారు’ చెప్పాడు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్ అయితే తేజ్ అంటే అందరు ఒకేసారి తిరిగి చూస్తారా? అడిగారు హోస్ట్. దీనికి ‘‘చిరు మామ ఓరేయ్ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక ఉప్పెన స్క్రీప్ట్‌ను మొదట నా ఫ్రెండ్స్‌తో కలిసి విన్నాను. ఆ తర్వాత సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఈ కథను చిరంజీవి మామయ్యకు వినిపించారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘ఐడియా బాగుంది.. సినిమా తీయండి’ అని ఆయన అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ఉప్పెన మూవీలోని రొమాంటిక్ సాంగ్(జల జల జలపాతం నువ్వు) చేసేటప్పుడు ఇబ్బంది పడ్డానన్నాడు. చూట్టు వందమంది ఉన్నారని, అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించదన్నాడు. ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు తాను నిజంగా ఏడ్చానని, బేబమ్మ నీకో మాట చెప్పాలనే సన్నివేశానికి దాదాపు 20పైనే టేక్ తీసుకున్నానన్నాడు. అది చేసేటప్పుడే అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని గుర్తు రాగానే కన్నీళ్లు వచ్చాయన్నాడు. ఇక చిన్న మామయ్య(పవన్ కల్యాణ్) తమ్ముడు, బద్రి సినిమాలను తాను సుమారు 120 సార్లు చూశానని వైష్ణవ్ పేర్కొన్నాడు. -
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
‘రంగరంగ వైభవంగా’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ వచ్చేసింది
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్ సర్కస్ చేశారు.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ) చిన్నప్పటి నుంచి గొడవపడే ఓ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివరల్లో ‘నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా’అంటూ వేష్ణవ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా చిన్న సినిమాలు విజయవంతం అవుతుండటంతో పరిశ్రమ మొత్తం సందడి సందడి మారిపోయింది. చిన్న నిర్మాతల్లో ఎక్కడలేని ధైర్యం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆడియెన్స్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చూస్తారన్నారు. ఆ తర్వాత మాస్ మూవీస్ చూసేందుకు వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత అస్సలు ఆడియెన్స్ రావడం లేదన్నారు. కానీ కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ నిరూపించాయి. (చదవండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ) ఈ మూడు చిత్రాల ఘన విజయం..చిన్న చిత్రాలకు గొప్ప ధైర్యాన్ని అందించింది. అందుకే సెప్టెంబర్ లో వరుస పెట్టి చిన్న సినిమాలు థియేటర్స్ కు క్యూ కట్టాయి. సెప్టెంబర్ 2న ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 9న సత్యదేవ్, తమన్నాల ‘గుర్తుందా సీతా కాలం’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. (చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..) ఈ మూడు చిత్రాలపై మంచి బజ్ ఉంది. సెప్టెంబర్ మూడో వారంలో నిఖిల్ కొత్త చిత్రం ‘18 పేజెస్’ రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 16 ‘శాకిని డాకిని’ విడుదలకు ముస్తాబవుతోంది. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కు అఫీసియల్ రీమేక్ గా తెరకెక్కింది శాకిని ఢాకిని. ఈ సినిమాకు పోటీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి, అల్లూరి రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎన్ని, ప్రేక్షకులను అలరిస్తాయో, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుతాయో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
రంగరంగ వైభవంగా రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. కేతిక శర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా మూవీని థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి! The Love, Laughter & Drama filled Youthful Family Entertainer #RangaRangaVaibhavanga locks a POWERFUL Release Date 💥🤙In theatres from September 2nd 🎦🍿#PanjaVaisshnavTej @TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth#RRVOnSep2nd pic.twitter.com/dfZwocn3pN— SVCC (@SVCCofficial) July 13, 2022 చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై జీవితంలోని కష్టాలను నీ ప్రేమతో గెలిచేస్తా.. కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్ -
‘రంగరంగ వైభవంగా’ మూవీ (ఫొటోలు)
-
'రంగరంగ వైభవంగా' టీజర్ విడుదల
-
రంగరంగ వైభవంగా టీజర్ వచ్చేసింది..
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. నన్నే చూస్తావ్, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అంటూ హీరోయిన్ వాయిస్‌తో టీజర్ మొదలైంది. ఈ మూవీలో హీరోహీరోయిన్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌తో మాట్లాడకపోయినా సరే, ఆమె ఆపదలో ఉందంటే మాత్రం ఆదుకునేందుకు క్షణాల్లో బయలుదేరతాడని కనిపిస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం ఇంట్రస్టింగ్ ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో చైతూతో డేటింగ్‌పై స్పందించిన శోభిత, వీడియో వైరల్! -
మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన 'కొండపొలం' పెద్దగా విజయం సాధించలేకపోయింది. తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు వైష్ణవ్. గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌కు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్ టీజర్‌ను కూడా వదిలారు. ఇందులో యంగ్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్‌తో టీజర్ పూర్తైంది. ఇది మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అని, ఇది కూడా ఉప్పెనంత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.