Ranga Ranga Vaibhavanga Movie OTT Release Date, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Ranga Ranga Vaibhavanga OTT Release: ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

Published Mon, Sep 26 2022 11:53 AM | Last Updated on Tue, Sep 27 2022 3:10 PM

Ranga Ranga Vaibhavanga OTT Premiere On Netflix on Dussehra - Sakshi

‘ఉప్పెన’తో యూత్‌ ఆడియన్స్‌ ఆకట్టుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపోలం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాతో తొలి ఫ్లాప్‌ని చూసిన వైష్ణవ్‌ కాస్తా గ్యాప్‌ తీసుకుని రంగ రంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గిరీశాయ దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘ఆది’ రీరిలీజ్‌! ఎప్పుడంటే..

రిలీజ్‌కు ముందు ట్రైలర్‌, పాటలతో హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం విడుదల అనంతరం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. రోటిన్‌ కథాంశంతో ఉండటంతో బాక్సాఫీసు డీలా పడింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవ్‌, కేతిక శర్మల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ ఇది సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఫలితంగా వైష్ణవ్‌ రెండో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది ఈ చిత్రం.

చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’లో పూరి రోల్‌ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన చిరు

ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని సమాచారం. బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రంగ రంగ వైభవంగా మూవీని దసరా పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తుందని తెలుస్తోంది. అక్టోబర్‌ 5న లేదా అక్టోబర్‌ 7 నుంచి ఈ మూవీ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ఇక త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement