
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇందులో సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. భావనా రవి, నాగశేఖర్ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ రీమేక్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్‌లో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment