
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. నటన ప్రాధాన్యమున్ను పాత్రలను ఎంచుకుంటూ సహా నటుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన గాడ్సే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదలై ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్రం పరాజయం పొందింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్స్రీన్‌పై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. త్వరలోనే గాడ్సే ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17న నుంచి గాడ్సే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్..
సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ కుట్టి ఐశ్వర్య హీరోయిన్‌గా నటించింది. నాగబాబు కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ విశ్వనాథ రామచంద్ర పాత్రలో కనిపించాడు. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాల కథాంశంగా గాడ్సే మూవీ తెరకెక్కింది. ఇదిలా ఉంటే సత్యదేవ్ నటించిన మరో చిత్రం గుర్తుందా శీతాకాలం కూడా థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సత్యదేవ్ చిరంజీవి గాడ్ ఫాదర్‌లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన అక్షయ్ కుమార్ రామ్‌సేతు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment