‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ‘గాడ్సే’లో నిర్భయంగా చూపిస్తున్నాం. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఎపిసోడ్ భావోద్వేగంగా ఉంటుంది. సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు మా మూవీలో చర్చించిన సమస్యల గురించి ఆలోచిస్తారు’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘గాడ్సే’.
చదవండి: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కళాశాలలో చదివేటప్పటి నుంచే నాకు సామాజిక బాధ్యత ఎక్కువ. అందరూ నిబంధనలు పాటించాలనుకునేవాన్ని. నా నిజ జీవితానికి ‘గాడ్సే’ కథ దగ్గరగా ఉండటంతో వెంటనే కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రంలో నేను విశ్వనాథ రామచంద్ర అనే పాత్రలో కనిపిస్తా. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, యువత ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే సమాజం పురోగమిస్తుందనే సందేశాన్ని ఇస్తున్నాం.
చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్' ఇంటర్వెల్ ఫైట్ రీ క్రియేట్.. నెట్టింట వైరల్
వాస్తవానికి దగ్గరగా ఉన్న ఈ చిత్ర కథ ప్రేక్షకులను వెంటాడుతుంది. ఎవరైనా స్టార్‌డమ్ కోసమే సినిమా ఇండస్ట్రీకి వస్తారు.. అయితే అది రావడానికి కష్ట పడటంతో పాటు ఓపిక అవసరం. వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఐశ్వర్య లక్ష్మీ బాగా చేశారు. పట్టాభిగారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సి.కల్యాణ్‌గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ‘గాడ్సే’ మూవీతో నా కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment