తిమ్మరుసులో ‘తియ్యగుందీ’ డైలాగ్‌.. నారా లోకేశ్‌పై మరోసారి సెటైర్లు | Nara Lokesh Tiyyagundi Dialogue In Satyadev Thimmarusu Movie | Sakshi
Sakshi News home page

Nara Lokesh: 'తియ్యగుందీ' డైలాగ్‌.. థియేటర్స్‌లో నవ్వులే నవ్వులు

Published Sat, Jul 31 2021 1:05 PM | Last Updated on Sat, Jul 31 2021 4:57 PM

Nara Lokesh Tiyyagundi Dialogue In Satyadev Thimmarusu Movie - Sakshi

సత్యదేవ్‌ తాజాగా నటించిన చిత్రం తిమ్మరసు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్‌ అయిన ఈ చిత్రం థియేరట్స్‌ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. డిఫరెంట్‌  కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్‌ ఈ చిత్రంలో లాయర్‌ అవతారం ఎత్తాడు. ఇంటెలిజెంట్‌ లాయర్‌గా నటించిన సత్యదేవ్‌ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రీఓపెన్‌ చేస్తాడు. హత్యకేసు వెనకాల ఉన్న చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా?లేదా అన్న అంశాలపై ఈ చిత్రం తెరకెక్కించింది.

ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ అదిరిపోయింది. ముఖ్యంగా ఓ సందర్భంలో హీరో సత్యదేవ్‌తో కలిసి బొండం తాగుతూ బ్రహ్మాజీ చెప్పిన ‘తియ్యగుందీ’ అనే డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి ప్రచారంలో నారా లోకేశ్‌.. ఓ మజ్జిగ తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఎంతగా ట్రోల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సందర్భం లేకుండా ప్రతీసారి తన అఙ్ఞానాన్ని బయటపెట్టే లోకేశ్‌ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్‌ను తిమ్మరసు సినిమాలో రిపీట్‌ చేయడంతో థియేటర్‌లో లోకేశ్‌ను గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. మరోసారి లోకేశ్‌పై జోకులు పేలుస్తూ నెట్టింట ట్రోల్స్‌, మీమ్స్‌లు క్రియేట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement