Butter milk
-
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!'కూర్చిక' పానీయం: ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు, పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.'రసాల' పానీయం:పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. ఎలా చేస్తారంటే..?బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.తేటతో కూడా..ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.తేమనం..తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.మజ్జిగమీద తేట:మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!) -
వేసవి తాపం : మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా!
వేసవి కాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి అల్లాడవలసిందే. అయితే కూల్డ్రింకులు, ఇతర శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పళ్లరసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచింది. వడదెబ్బ తగలకుండా, శరీరం డీ-హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవగా, ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. వేసవికాలంలో రోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో, వాటిని ఎలా పుచ్చుకోవాలో చూద్దాం... మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికడు సొంఠి, చిటికడు సైంధవ లవణం కలుపుకుని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండుసార్లు మజ్జిగను తీసుకోండి. -
మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు
మసాలా మజ్జిగకి కావలసినవి : పెరుగు – ఒకటిన్నర కప్పులు జీలకర్ర పొడి – అరటీస్పూను పుదీనా తరుగు – టేబుల్ స్పూను బ్లాక్ రాక్‌సాల్ట్ – అరటీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను కరివేపాకు తరుగు – అరటీస్పూను మునగాకు పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను చల్లని నీళ్లు – రెండు గ్లాసులు. తయారీ విధానం: ∙మిక్సీజార్‌లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మునగాకుపొడి, జీలకర్ర పొడి, రాక్‌సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ∙ఇవన్నీ నలిగిన తరువాత పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ∙ఈ మిశ్రమంలో నీళ్లు పోసి కలుపుకుని, దాల్చినచెక్క పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!) -
బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా
వేసవిలో కడుపులో చల్లచల్లగా ఉండాలంటే ఈసారి కన్నడ కుంబలకాయ్ మజ్జిగె హులి ట్రై చేసి చూడండి! కన్నడ స్టైల్ మజ్జిగచారుతో ఎంచక్కా భోజనం చేసేయండి! కావలసినవి: ►బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కేజీ (చెక్కు, గింజలు తొలగించి ముక్కలు చేయాలి) ►పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ►పచ్చి కొబ్బరి తురుము– కప్పు ►పచ్చిమిర్చి– 3 ►అల్లం– అంగుళం ముక్క ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►పెరుగు – కప్పు. ►పోపు కోసం: వంట కొబ్బరి నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఇంగువ – పావు టీ స్పూన్; కరివేపాకు – 4 రెమ్మలు. తయారీ: ►ముందుగా పచ్చిశనగపప్పును కడిగి నీటిలో 20 నిమిషాల సేపు నానబెట్టాలి. ►పెరుగులో కప్పు నీరు పోసి చిలికి పక్కన ఉంచాలి. ►గుమ్మడి కాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్ లేదా నేరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►శనగపప్పును నీటి నుంచి తీసి మరో గిన్నెలో వేసి అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ►పెనంలో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, మిక్సీలో రుబ్బిన పేస్ట్ వేసి కప్పు నీటిని పోసి వేడి చేయాలి. ►ఈ మిశ్రమం ఉడకడం మొదలైన తర్వాత చిలికిన పెరుగు వేసి దించేయాలి. ►పోపు లేని మజ్జిగె హులి సిద్ధమైందన్నమాట. ►ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తరవాత జీలకర్ర వేయాలి. ►అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఈ పోపును మజ్జిగె హులిలో కలపాలి. చదవండి: అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ.. -
పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగారంటే!
మజ్జిగను బటర్ మిల్క్ అంటాం కదా.. వేసవి వచ్చేసరికి ఇది కాస్తా బెటర్ మిల్క్‌గా మారుతుంది. అదెలాగంటే... మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ ఆయుర్వేద నిపుణులు, పెద్దలు చెబుతారు. ఆరోగ్య ప్రయోజనాలివే! ►మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక దాహం తీరుతుంది. అంతేకాదు, వడ దెబ్బ తగలకుండా ఉంటుంది. ►జీలకర్ర, ధనియాలు, అవిసెగింజలు, సైంధవ లవణం మెత్తగా పొడి చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచిది. ►ఇలా తయారు చేసుకున్న మజ్జిగని లంచ్‌తో లేదా మధ్యాహ్నం 3–4 గంటల సమయంలో తాగడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసి.. ►ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ►ఎండలో తప్పనిసరి అయి బయటకు వెళ్లేటప్పుడు... ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ►ఇందులో పంచదార, ఉప్పు బదులుగా పైన చెప్పుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, ►సాధ్యమైనంత వరకు మజ్జిగని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఇందులో ఉండే మేలు చేసే బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అదేవిధంగా ప్యాక్ చేసిన మజ్జిగ బదులు అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాజా మజ్జిగ తాగడం ప్రయోజనకరం. బయటకు వెళ్లినప్పుడు శీతల పానీయాల బదులు కనీసం ప్యాక్ చేసిన మజ్జిగ తాగినా ఫరవాలేదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కొరకు మాత్రమే! చదవండి: Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్! ముఖం మెరిసేలా.. -
మజ్జిగను సంస్కృతంలో ఏమంటారు? వేసవిలో ఎక్కువగా తాగుతున్నారా?
కాఫీ, టీలు ప్రాచుర్యంలోకి రాకముందు మజ్జిగ మనవాళ్ల మర్యాద పానీయం. వేసవితాపం నుంచి తక్షణ ఉపశమం పొందడానికి మజ్జిగ ప్రశస్తమైన పానీయం. తోడుపెట్టిన పెరుగులో రెట్టింపు నీరు కలిపి, బాగా చిలికి మజ్జిగను తయారు చేస్తారు. చిలికిన తర్వాత వెన్నను వేరుగా తీసేసిన మజ్జిగ చాలామంచిది. రుచి కోసం ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం వంటివి చేర్చి మరీ మజ్జిగ సేవించడం కొందరి అలవాటు. మజ్జిగను సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. (చదవండి: పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా!) ‘తక్రం త్రిదోష శమనం రుచి దీపనీయం’ అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మజ్జిగ సేవించడం వల్ల శరీరంలోని త్రిదోషాలైన వాత, పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయని, నోటికి రుచి పెరిగి, అన్నహితవు కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. మజ్జిగలోని క్యాల్షియం, విటమిన్–డి, విటమిన్–బి6, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేసవిలో మజ్జిగను నేరుగా తీసుకోవడంతో పాటు మజ్జిగ పులుసు వంటి వంటకాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. (చదవండి: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా?) -
తిమ్మరుసులో ‘తియ్యగుందీ’ డైలాగ్.. నారా లోకేశ్‌పై మరోసారి సెటైర్లు
సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం తిమ్మరసు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయిన ఈ చిత్రం థియేరట్స్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్ ఈ చిత్రంలో లాయర్ అవతారం ఎత్తాడు. ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించిన సత్యదేవ్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. హత్యకేసు వెనకాల ఉన్న చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా?లేదా అన్న అంశాలపై ఈ చిత్రం తెరకెక్కించింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ అదిరిపోయింది. ముఖ్యంగా ఓ సందర్భంలో హీరో సత్యదేవ్‌తో కలిసి బొండం తాగుతూ బ్రహ్మాజీ చెప్పిన ‘తియ్యగుందీ’ అనే డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి ప్రచారంలో నారా లోకేశ్.. ఓ మజ్జిగ తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఎంతగా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం లేకుండా ప్రతీసారి తన అఙ్ఞానాన్ని బయటపెట్టే లోకేశ్ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్‌ను తిమ్మరసు సినిమాలో రిపీట్ చేయడంతో థియేటర్లో లోకేశ్‌ను గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. మరోసారి లోకేశ్‌పై జోకులు పేలుస్తూ నెట్టింట ట్రోల్స్, మీమ్స్‌లు క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. -
లాక్డౌన్: పోలీసులకు మజ్జిగ అందించిన ఐటీ ఉద్యోగి
సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు అందరూ సహకరించేలా పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు సేవలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పోలీసులు ఎవరూ రోడ్లపైకి రాకుండా సామాజిక దూరం పాటించేలా సేవలందిస్తున్నారు. క్రమంలో వారు ఎండను సైతం లెక్క చేయడం లేదు. ఇలా కరోనాతో యుద్ధంలో సైనికుల పాత్ర పోషిస్తున్న రక్షక భటులకు మద్దతునిచ్చేందుకు ఖమ్మంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందుకు వచ్చారు. రక్షక భటులకు చల్లని మజ్జిగ పానియం పంపిణీ చేసి వారి దాహన్ని తిరుస్తున్నాడు. ఇక లాక్డౌన్ కారణంగా దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎదుటివారికి సాయం చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఇందుకోసం ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ భరోసా అందిస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు) -
మీ కడుపు చల్లగుండ
‘పలుచన కావడమ’టే విలువ తగ్గడమని తెలుగు వాడుక. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుం’దనీ తెలుగులో సామెత.అవును... మజ్జిగ నైజమే అంత. తాను పలుచనైనప్పటికీ భోజనానికి నలుగురెక్కువొచ్చినా, పదిమంది అదనంగా వేంచేసినా అందరి కడుపూ నిండాలనేదే, అందరికీ పోషకాలు అందాలనేదే మజ్జిగ సుగుణం. కడుపును చల్లగా చేసేంత మంచితనం ...కడుపులో చల్ల కదలకుండా ఉంచేంత గొప్పదనం మజ్జిగది... రండి... ఈ వేసవిలో రకరకాల మజ్జిగ రుచులు ఆస్వాదించండి. సోర్ అండ్ స్పయిసీ బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత ; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మ రసం – 5 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు వేసి, చిక్కగా గిలకొట్టాలి ►ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు జత చేయాలి ►నిమ్మ రసం, నీళ్లు జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసుకోవాలి ►ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా అందించాలి. స్మోక్డ్ మసాలా చాస్ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; బొగ్గు ముక్కలు – 2; కరివేపాకు – 5 ఆకులు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (సన్నగా తరగాలి); నూనె – ఒక టీ స్పూను. తయారీ: ►మిక్సీలో పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు వేసి తిప్పాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి ►మజ్జిగను ఒక పాత్రలోకి తీసుకోవాలి ► ఒక పాత్రలో కరివేపాకు, పచ్చి మిర్చి, జీలకర్ర ఉంచాలి ► బొగ్గును స్టౌ మీద కాల్చి, ఆ బొగ్గును చిన్న పాత్రలోకి తీసి, వెంటనే ఆ పాత్రను మజ్జిగ మీద ఉంచాలి ► నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రలను మండుతున్న బొగ్గు మీద వేసి సిల్వర్ ఫాయిల్‌తో వెంటనే మూసేయాలి ► బొగ్గు మీద నుంచి వచ్చే పొగ మజ్జిగలోకి చేరి, కొత్త రుచి వస్తుంది ► ఐదు నిమిషాల తరవాత సిల్వర్ ఫాయిల్ తీసేయాలి ► బొగ్గును తీసి పడేయాలి ►మజ్జిగను గ్లాసులలోకి పోసి, పుదీనా ఆకులతో అలంకరించి అందించాలి. మసాలా బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి ►మూడు కప్పుల నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి ►ఐస్‌క్యూబ్స్ జత చేయాలి మిక్సీ జార్లో వేసి రెండు నిమిషాల పాటు మిక్సీ తిప్పి, గ్లాసులలోకి తీసుకుని, కొత్తిమీర ఆకులతో అలంకరించి, చల్లగా అందించాలి నిమ్మ ఆకులు కరివేపాకు మజ్జిగ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; నిమ్మ ఆకుల తరుగు – పావు కప్పు; కరివేపాకు తరుగు – ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను. తయారీ: ►పెరుగును ఒక కుండలో పోసి కవ్వంతో బాగా చిలకాలి ►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు చిలకాలి ►ధనియాల పొడి, అల్లం తురుము, నిమ్మ రసం జత చేసి రెండు నిమిషాలు చిలకాలి ►నిమ్మ ఆకులు, కరివేపాకు తరుగు జత చేసి, గరిటెతో కలిపి మూత ఉంచాలి అర గంట తరవాత గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. కుకుంబర్అండ్ మింట్ లీవ్స్బటర్ మిల్క్ కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; ఉప్పు – తగినంత; ఐస్ క్యూబ్స్ – 4; కీర దోస తురుము – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; కీర దోస చక్రాలు – 3 (అలంకరించడం కోసం); చల్లటి నీళ్లు – 3 కప్పులు; కొత్తిమీర – గుప్పెడు; పుదీనా – అర కప్పు. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి ►కీరదోస తురుము, అల్లం తురుము, ఐస్ క్యూబ్స్ జతచేసి, మిక్సీలో వేసి రెండు నిమిషాలు తిప్పాలి ►చాట్ మసాలా, మిరియాల పొడి, చల్లటి నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి ►గ్లాసులలోకి తీసుకుని పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు జత చేసి, కీరదోస చక్రాలతో అలంకరించి చల్లగా అందించాలి. స్పైసీ బటర్ మిల్క్ కావలసినవి: పుదీనా ఆకులు – 10; తరిగిన పచ్చి మిర్చి – 1; కొత్తిమీర – కొద్దిగా; అల్లం ముక్క – చిన్నది; గడ్డ పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; వేయించిన జీలకర్ర పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – ఒక కప్పు; ఐస్ క్యూబ్స్ – 10. పోపు కోసం... నెయ్యి – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ. తయారీ: ►మిక్సీ జార్లో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం వేసి మెత్తగా చేయాలి ►పెరుగు, ఇంగువ, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ►నిమ్మ రసం, ఒక కప్పు నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ జత చేయాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ►మజ్జిగ గ్లాసులలో వేసి అందించాలి. దబ్బ ఆకులు మిరియాల పొడి మజ్జిగ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; దబ్బ ఆకుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను ; ఉప్పు – తగినంత. తయారీ: ►పెరుగును కుండలో వేసి కవ్వంతో చిలకాలి ►ఉప్పు, నీళ్లు జత చేసి రెండు నిమిషాల పాటు చిలకాలి ►నిమ్మ రసం, మిరియాల పొడి జత చేసి మరోమారు చిలకాలి ►దబ్బ ఆకుల తరుగు, కొత్తిమీర తరుగు వేసి గరిటెతో కలిపి సుమారు గంట సేపు మూత ఉంచాలి ►గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. మింట్ జీరా బటర్ మిల్క్ కావలసినవి: పెరుగు – రెండు కప్పులు; జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్ మసాలా – పావు టీ స్పూను; ఐస్ క్యూబ్స్ – కొద్దిగా; పుదీనా తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు. తయారీ: ►పెరుగును ఒక కుండలో వేసి కవ్వంతో బాగా చిలకాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మరోమారు చిలకాలి ►అల్లం తురుము, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మ రసం జత చేసి మరోమారు చిలకాలి ►జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు జత చేసి గరిటెతో బాగా కలపాలి ►ఐస్ క్యూబ్స్ జత చేసి గ్లాసులో పోసి చల్లగా అందించాలి. చిట్కాలు ►మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది ►వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ►గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు వాడితే, పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. మజ్జిగ ఉపయోగాలు మజ్జిగ ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు. ►పథ్యంగా పని చేస్తుంది ►ఆకలిని పెంచుతుంది ►బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది ►మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది ►మజ్జిగను ఎక్కువగా వాడేవారికి పైల్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ ►మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది ∙ ►రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది ►శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్‌లను అందిస్తుంది ►గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ►బిపి, కొలస్ట్రాల్‌లను నివారిస్తుంది ►శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది ►శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది ►ఎముకలను బలంగా చేస్తుంది ►ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సాయపడుతుంది ►బరువు తగ్గేందుకు దోహద పడుతుంది ►అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. -
మజ్జిగతో శుభ్రం చేయాలి...
ఇంటిప్స్ ప్లాస్క్‌లో గంటల తరబడి టీ కానీ కాఫీ కానీ పోసి ఉంచడం వల్ల అది శుభ్రపరిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఆ దుర్వాసనను పోగొట్టాలంటే డిష్వాషర్ కంటే ముందు దాన్ని మజ్జిగతో శుభ్రం చేయాలి.రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దాలి. అలా చేస్తే అవి కొత్త వాటిలా మెరవడం ఖాయం.పచ్చి కొబ్బరి చిప్పలు ఒక వారం పాటు తాజాగా ఉండాలా? అయితే రోజూ నిమ్మరసాన్ని ఆ చిప్పలకు రుద్దితే చాలు.