Best Summer Recipes: How To Prepare Kannada Kumbalakai Majjige Huli Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Recipe: బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్‌ మజ్జిగచారు తయారీ ఇలా

Published Fri, Mar 17 2023 10:48 AM | Last Updated on Fri, Mar 17 2023 12:06 PM

Summer Recipes In Telugu: Kannada Kumbalakai Majjige Huli - Sakshi

వేసవిలో కడుపులో చల్లచల్లగా ఉండాలంటే ఈసారి కన్నడ కుంబలకాయ్‌ మజ్జిగె హులి ట్రై చేసి చూడండి! కన్నడ స్టైల్‌ మజ్జిగచారుతో ఎంచక్కా భోజనం చేసేయండి!
కావలసినవి:
►బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కేజీ (చెక్కు, గింజలు తొలగించి ముక్కలు చేయాలి)
►పచ్చి శనగపప్పు – టేబుల్‌ స్పూన్‌
►పచ్చి కొబ్బరి తురుము– కప్పు

►పచ్చిమిర్చి– 3
►అల్లం– అంగుళం ముక్క
►ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి
►పెరుగు – కప్పు.
►పోపు కోసం: వంట కొబ్బరి నూనె – టీ స్పూన్‌; ఆవాలు – అర టీ స్పూన్‌ ; జీలకర్ర – అర టీ స్పూన్‌ ; ఇంగువ – పావు టీ స్పూన్‌; కరివేపాకు – 4 రెమ్మలు.

తయారీ:
►ముందుగా పచ్చిశనగపప్పును కడిగి నీటిలో 20 నిమిషాల సేపు నానబెట్టాలి.
►పెరుగులో కప్పు నీరు పోసి చిలికి పక్కన ఉంచాలి.
►గుమ్మడి కాయ ముక్కలను ప్రెషర్‌ కుక్కర్‌ లేదా నేరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

►శనగపప్పును నీటి నుంచి తీసి మరో గిన్నెలో వేసి అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్‌ చేయాలి.
►పెనంలో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, మిక్సీలో రుబ్బిన పేస్ట్‌ వేసి కప్పు నీటిని పోసి వేడి చేయాలి.
►ఈ మిశ్రమం ఉడకడం మొదలైన తర్వాత చిలికిన పెరుగు వేసి దించేయాలి.
►పోపు లేని మజ్జిగె హులి సిద్ధమైందన్నమాట.

►ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తరవాత జీలకర్ర వేయాలి.
►అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఈ పోపును మజ్జిగె హులిలో కలపాలి.

చదవండి: అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement