కొబ్బరి తురుముతో కోకోనట్ డ్రీమ్ ఇలా తయారు చేసుకోండి.
కోకోనట్ డ్రీమ్ తయారీకి కావలసినవి
►పచ్చి కొబ్బరి తురుము – 200 గ్రా
►మంచి నీరు – పావు లీటరు
►పండిన అరటిపండ్లు – 4
►నిమ్మకాయ – 1.
తయారీ:
►కొబ్బరి తురుమును మిక్సీలో వేసి నీటిని పోస్తూ బ్లెండ్ చేయాలి.
►బ్లెండ్ చేసే కొద్దీ కొబ్బరిలోని క్రీమ్ పైకి తేలుతుంది.
►ఈ పాలను మరొక పాత్రలోకి వంపి, పైకి తేలిన క్రీమ్ తిరిగి కొబ్బరి పాలలో కలిసి పోయే వరకు పక్కన ఉంచాలి. వడపోయవద్దు.
►కొబ్బరి కోరు పూర్తిగా మెదగకుండా కొంత ఉండిపోయినప్పటికీ అలాగే తాగడం ఆరోగ్యకరం.
►అరటి పండు గుజ్జును మెత్తగా బ్లెండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి.
►ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో పోసి సమంగా కలిసే వరకు బాగా కలపాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Palak Dosa: గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే!
పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
Comments
Please login to add a commentAdd a comment