Recipes In Telugu: How To Prepare Banana Coconut Burfi Sweet In Telugu - Sakshi
Sakshi News home page

Banana Coconut Burfi In Telugu: అరటి పండ్లు, కొబ్బరి కోరు.. నోరూరించే స్వీట్‌ రెడీ!

Published Fri, May 20 2022 1:05 PM | Last Updated on Fri, May 20 2022 1:25 PM

Recipes In Telugu: How To Make Banana Coconut Burfi In Telugu - Sakshi

అరటి పండ్లు, కొబ్బరి కోరు, పంచదార ఇంట్లో  ఉంటే చాలు ఇలా సులువుగా బనానా కోకోనట్‌ బర్ఫీ తయారు చేసుకోవచ్చు.

బనానా కోకోనట్‌ బర్ఫీ తయారీకి కావలసినవి:
►అరటి పండ్లు – 3  (గుజ్జులా చేసుకోవాలి)
►మిల్క్‌ పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు
►పంచదార పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)
►చిక్కటి పాలు – 1 కప్పు, నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు
►కొబ్బరి కోరు – పావు కప్పు, డ్రైఫ్రూట్స్‌ – అభిరుచిని బట్టి

బనానా కోకోనట్‌ బర్ఫీ తయారీ విధానం:
►ముందుగా పాలు కాచి.. అందులో అరటిపండ్ల గుజ్జు వేసుకోవాలి.
►చిన్న మంట మీద, బాగా ఉడికిన తర్వాత పంచదార పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి.
►దగ్గర పడుతున్న సమయంలో మిల్క్‌ పౌడర్, నెయ్యి, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా దగ్గర పడగానే స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►అనంతరం డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి, బాగా చల్లారనిచ్చి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్‌.. మటన్‌ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement