milk powder
-
Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
నోరూరించే బ్రెడ్ జామూన్ ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►పంచదార – కప్పు ►యాలకులు – మూడు (పొడిచేసుకోవాలి) ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►తెల్లని బ్రెడ్ స్లైస్‌లు – ఆరు ►క్రీమ్ మిల్క్ పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు ►ఫ్రెష్ క్రీమ్ – టేబుల్ స్పూను ►వేడి పాలు – నాలుగు టేబుల్ స్పూన్లు ►నెయ్యి లేదా నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ►గిన్నెలో పంచదార, కప్పు నీళ్లుపోసి వేడిచేయాలి ►సన్నని మంటమీద సుగర్ సిరప్ తయారయ్యేవరకు మరిగించాలి ►సిరప్ అయ్యిందనుకున్నప్పుడు యాలకులపొడి, నిమ్మరసం వేసి చక్కగా కలిపి తిప్పి, స్టవ్ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి ►ముదురు రంగులో ఉన్న బ్రెడ్ స్లైసుల అంచులు కత్తిరించాలి. ►ఇప్పుడు మిగిలిన స్లైసుని ముక్కలుగా తరిగి, తరువాత పొడిచేసుకోవాలి ►ఈ పొడిలో పాలపొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా పాలు పోస్తూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి ►చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కనపెట్టుకోవాలి ►వేడెక్కిన నూనెలో ఈ ఉండలను వేసి సన్నని మంటమీద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసుకోవాలి ►అన్ని ఉండలు వేగిన తరువాత వెంటనే సుగర్ సిరప్‌లో వేసి రెండు గంటలపాటు ఉంచి, తరువాత సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి! Fish Omelette Rolls Recipe: నోరూరించే ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ తయారీ ఇలా! -
Recipes: అరటి పండ్లు, కొబ్బరి కోరు.. నోరూరించే స్వీట్ రెడీ!
అరటి పండ్లు, కొబ్బరి కోరు, పంచదార ఇంట్లో ఉంటే చాలు ఇలా సులువుగా బనానా కోకోనట్ బర్ఫీ తయారు చేసుకోవచ్చు. బనానా కోకోనట్ బర్ఫీ తయారీకి కావలసినవి: ►అరటి పండ్లు – 3 (గుజ్జులా చేసుకోవాలి) ►మిల్క్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►చిక్కటి పాలు – 1 కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – పావు కప్పు, డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి బనానా కోకోనట్ బర్ఫీ తయారీ విధానం: ►ముందుగా పాలు కాచి.. అందులో అరటిపండ్ల గుజ్జు వేసుకోవాలి. ►చిన్న మంట మీద, బాగా ఉడికిన తర్వాత పంచదార పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడుతున్న సమయంలో మిల్క్ పౌడర్, నెయ్యి, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►అనంతరం డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి, బాగా చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా -
పాలపొడి కోసం లొల్లి: గర్భిణిని చంపిన భర్త!
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్): కుమారుడికి పాలపొడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణం పోయింది. ఎస్సై శ్రీధర్‌గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కమ్మర్పల్లి మండల కేంద్రంలో యెల్మల గంగమణి, గంగాధర్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గంగమణి ఏడు నెలల గర్భిణి. కుమారుడికి పాలపొడి డబ్బా తీసుకురావాలని వారం క్రితం గంగమణి భర్తను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంగాధర్ కోపంతో సమీపంలోని ఇటుకను తీసుకుని భార్యపైకి బలంగా విసిరాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందింనా పరిస్థితి మెరుగుపడలేదు. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో శనివారం స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. చదవండి: ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం పిల్లలను భయపెట్టేందుకు.. నీళ్లలో హిట్ కలుపుకుని -
పాలకూట విషం..!
► నాసిరకం పాల పొడితో యథేచ్ఛగా పాల దందా ►పలు రాష్ట్రాల్లో సీజ్ చేసిన పాల పొడితో తయారీ.. ► కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ ► నగరంలోని కొన్ని హాస్టళ్లకు నిత్యం ఇవే సరఫరా.. ఇబ్రహీంపట్నం శివార్లలో ఏడాదిగా వ్యవహారం ► ఇలాంటి పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యుల హెచ్చరిక ► 5,000లీటర్లు గేదె పాల పేరిట మార్కెట్లో రోజూ అమ్ముతున్న పౌడర్ పాలు ►రెవా, ప్రీతి, ఎన్ఎస్ఆర్ పేర్లతో ప్యాకెట్లలో నింపి విక్రయం.. ప్రముఖ కాలేజీల హాస్టళ్లకు సరఫరా ఎలా చేస్తున్నారంటే..? నాసిరకం పాలపొడిని కిలోకు రూ.150 నుంచి 180 వరకు చెల్లించి కొంటున్నారు. ఆ పాల పొడికి నీళ్లు కలిపి 9 లీటర్ల దాకా పాలు తయారు చేస్తున్నారు. వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకేజింగ్ చేసి.. లీటర్‌కు రూ. 40 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు వేల లీటర్ల పాలను విక్రయిస్తూ.. రోజూ రూ.లక్షకుపైగా మిగుల్చుకుంటున్నారు. హైదరాబాద్: అదో ‘కర్మాగారం’.. అందులో పాలు తయారవుతాయి.. పాలు తయారు కావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును అక్కడ.. జరుగుతున్న తంతు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! రైతులెవరూ పాలు విక్రయించకున్నా.. నేరుగా గేదెల నుంచి తీయకున్నా అక్కడ రాత్రికి రాత్రే వేల లీటర్ల కొద్దీ పాలు రెడీ అవుతాయి. అదంతా పాల పౌడర్ మహిమ! అదీ నాసిరకం పౌడర్. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ఆ పాల పౌడర్‌ను అధికారులు ఎప్పుడో సీజ్ చేశారు. ఇక్కడ అదే పౌడర్‌తో వేల లీటర్ల పాలు తయారు చేస్తూ నోటికొచ్చిన ఓ బ్రాండ్ పేరుతో ప్యాకెట్లో అందంగా ముస్తాబు చేసి అచ్చమైన గేదె పాలు అంటూ మార్కెట్లో డంప్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో ప్రతిరోజూ ఏకంగా 5 వేల లీటర్ల పాలను అమ్మేస్తున్నారు. కొన్ని ప్రముఖ విద్యా సంస్థల హాస్టళ్లకు నిత్యం అవే పాలను అంటగడు తున్నారు. రాజధాని నగర శివారులోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. దాదాపు ఏడాదిగా ఈ పా‘పాలు’ ప్రవహిస్తున్నా అధికారులెవరూ అడ్డుకట్ట వేయకపోవడం గమనార్హం. పాలు దొరకని రోజు తాత్కాలికంగా పౌడర్ పాలు వాడినా పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ నిత్యం అవే పాలు, అందులోనూ నాసిరకం పౌడర్‌తో తయారైన పాలు తాగితే ఒళ్లు గుల్ల అవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నోటికొచ్చిందే పేరు.. ఇబ్రహీంపట్నం పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో ఈ డెయిరీ అక్రమ దందాకు పాల్పడుతోంది. తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ప్యాకెట్లపై ఒకేపేరు కాకుండా రకరకాల బ్రాండ్ల పేర్లను వాడుకుంటోంది. రెవా, ప్రీతి, ఎన్ఎస్ఆర్ లాంటి పేర్లతో ముద్రించిన ప్యాకెట్లు ఈ డెయిరీలో సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో నాసిరకం పౌడర్‌తో తయారు చేసిన పాలను నింపి గేదె పాలు అంటూ మార్కెట్లోకి సరఫరా చేస్తోంది. గతంలో కొంతకాలం ఈ డెయిరీ నిర్వాహకులు స్థానిక రైతుల నుంచి పాలను కొనుగోలు చేశారు. వాటిలో వెన్న తీసి ప్యాకెట్ పాలను విక్రయించారు. అయితే పాల సేకరణ ధర పెరిగే కొద్దీ ఈ డెయిరీ దెబ్బతింది. గేదె పాల కంటే పౌడర్ పాలతో ఎక్కువ లాభాలు గడించే అవకాశముందని డెయిరీ నిర్వాహకులు ఈ దందాకు తెరలేపారు. మొదట్లో వినియోగదారులకు అనుమానం రాకుండా కొంచెం పాలు, పాల పౌడర్ వినియోగించి విక్రయించారు. ఇప్పుడు పూర్తిగా నాసిరకం పాల పౌడర్‌తో చేసిన పాలనే అమ్మేస్తున్నారు. కేంద్రంలో బస్తాల కొద్దీ పౌడర్ నిల్వ చేస్తున్నారు. వాటిని సరిగ్గా నిల్వ చేయకుంటే పౌడర్‌లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఇలా బస్తాలకు బస్తాలు నిల్వచేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెన్నశాతాన్ని పెంచేస్తున్నారిలా.. ఇటీవల రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఎస్ఓటీ(స్పెషల్ ఆపరేషన్ టీం) పోలీసుల దాడుల్లో కల్తీ పాల దందా వెలుగులోకి వచ్చింది. ఇందులో కొందరు అక్రమార్కులు వెన్న శాతం పెంచేందుకు పాలల్లో యూరి యా, పామాయిల్‌ను కలుపుతున్నట్టు తేలింది. సహజంగా పాలల్లో 5 నుంచి 6 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలకు లీటరుకు రూ.36 నుంచి రూ.39 వరకు చెల్లిస్తారు. అయితే కొందరు ఈ వెన్న శాతాన్ని పెంచేందుకు అక్రమమార్గం పట్టారు. ముందుగా రెండు లీటర్ల పాలను తీసుకుని అందులో కొంత యూరియా, పామాయిల్ వేశారు. దీంతో ఆ పాలు ఘన రూపంలోకి మారతాయి. తర్వాత ఈ మిశ్రమానికి నీటిని కలిపి.. వాటిని మామూలు పాలలో కలిపేస్తున్నారు. దీంతో వెన్న శాతం ఘననీయంగా పెరుగుతోంది. ఇలా పాలను కల్తీ చేస్తూ సుమారు తొమ్మిది మంది ప్రతిరోజు మదర్ డెయిరీలో పాలను విక్రయిస్తూ అధిక ధర పొందారు. వెన్నశాతంపై అనుమానం రావడంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు వారిని పట్టుకొని గుట్టు రట్టు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నట్లు చెబుతున్నారు. రోజు తాగితే ఊబకాయమే గేదె, ఆవు పాలల్లో మ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు తగిన మోతాదులో ఉంటాయి. పౌడర్ పాలల్లో ప్రోటీన్లు ఎక్కువున్నా కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ఈ పాలు రెగ్యులర్‌గా తీసుకుంటే పిల్లల్లో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నడి వయసున్నవారికి మధుమేహం వచ్చే అవకాశం అధికం. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప పౌడర్ పాలు నిత్యం తీసుకోవడం మంచిది కాదు. – డాక్టర్ సుజాత, న్యూట్రీషియనిస్ట్, యశోద హాస్పిటల్ హైదరాబాద్‌కు పాలు ఇలా.. ప్రతిరోజూ కావాల్సింది – 28 లక్షల లీటర్లు ప్యాకెట్ల రూపంలో వచ్చేది – 22 లక్షల లీటర్లు రైతులు నేరుగా విక్రయిస్తోంది –6 లక్షల లీటర్లు -
ఆపసోపాలు
► జిల్లాలో తీవ్రమైన పాల కొరత ► రోజుకు 10లక్షల లీటర్లు అవసరం ► ప్రస్తుతం ఉత్పత్తి 6 లక్షల లీటర్లే.. ► పశుగ్రాసం, నీటి సమస్యతో తగ్గిన ఉత్పత్తి ► డెయిరీల్లో పాల పొడి వినియోగం? ► భారంగా మారిన పశువుల పెంపకం ప్రతి ఒక్కరూ రోజుకు 220 మిల్లీలీటర్ల పాలు తీసుకున్నప్పుడే తగిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ చెబుతోంది. ప్రస్తుతం జిల్లా జనాభా 45లక్షలు. ఈ ప్రకారం దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6లక్షల లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పాల పొడి వినియోగం పాల కొరతను అధిగమించేందుకు డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శీతాకాలం, వానాకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నపుడు పాల పొడి తయారుచేసుకోవడం సర్వసాధారణం. కొరత ఏర్పడినప్పుడు అదే పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. కరువు, వేసవి కారణంగా ప్రస్తుతం పాల కొరత ఉత్పన్నం కావడంతో డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి సమస్య.. పశుగ్రాసం కొరత పశు పోషణను ప్రశ్నార్థకం చేస్తోంది. పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పాడి పశువులు దాదాపు 8 లక్షలు. కరువు కారణంగా గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. మరో 4లక్షల పశువులు ఒట్టిపోవడంతో.. పచ్చిమేత దొరక్క, నీటి సమస్యతో పాల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మనుషులు తాగేందుకే నీళ్లు దొరకని పరిస్థితుల్లో పశువుల దాహార్తి తీర్చడం రైతులకు భారంగా మారుతోంది. శీతా కాలం, వానా కాలంలో సగటున ఒక పాడి పశువు 6 లీటర్ల వరకు పాలు ఇస్తుండగా.. ప్రస్తుతం 3 లీటర్లకు పడిపోయింది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నెలలో 8.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయడం చూస్తే.. కొరత ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. తగ్గిన పాల ఉత్పత్తి ఇటీవల కాలంలో పాడి పరిశ్రమ పట్ల యువత ఆసక్తి చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఊపందుకుంది. వేసవిలోనూ నిర్వాహకులు పాల ఉత్పత్తి తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పశుగ్రాసం కొరత.. నీటి సమస్య.. దాణా కారణంగా పాల ఉత్పత్తి 10 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఆపై పాడి పశువులు కలిగిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంటోంది. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యం గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయింది. పశువుల దాహర్తి తీర్చేందుకు గ్రామాల్లో తోట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80 శాతం గ్రామాల్లో వీటి ఊసే కరువైంది. దాదాపు 3 నెలలుగా నీటితొట్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇక పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. సైలేజి గడ్డి సబ్సిడీపై పంపిణీ చేస్తున్నా పశువులు తినకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగితాల్లోనే కొత్త పాడి కొత్త పాడి కాగితాలకే పరిమితం అవుతోంది. డీఆర్డీఏ-వెలుగులో 2015-16లో 10వేలకు పైగా పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు తెలుస్తోంది. పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు జిల్లాలో పశుగ్రాసం కొరతను అధిగమించి పాల దిగుబడి పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సబ్సిడీపై రైతులకు సైలేజి గడ్డి పంచుతున్నాం. సబ్సిడీ పోను రైతులు కిలోకు రూ.2 ప్రకారం చెల్లించాలి. ముఖ్యంగా వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులకు 75 శాతం సబ్సిడీపై మొలకగడ్డి యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇళ్లలోనే ప్టాస్టిక్ ట్రేల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు. అజొల్లా యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు అందిస్తున్నాం. దాణాకు అజొల్లాను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. నీటి వసతి కలిగిన రైతులకు పశుగ్రాసాల సాగుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అవసరమైన రైతులు సంబంధిత పశువైద్యులను సంప్రదించవచ్చు. - డాక్టర్ సుదర్శన్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ -
500 కిలోల పాలపౌడర్ స్వాధీనం
రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 వందల కిలోల పాలపౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని స్కూల్ పిల్లలకు ఇవ్వాల్సిన ఈ పాలపౌడర్‌ను అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ విక్ర యించడానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
పాలు = యూరియా + మంచినూనె
ఘట్కేసర్: కల్తీ పాల తయారీ గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. అవుశాపూర్‌కు చెందిన రషీద్, నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రవి గతంలో పాల వ్యాపారం చేశారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో కల్తీపాల తయారీని ఎంచుకున్నారు. దీనికి మండలంలోని ఏదులాబాద్ శివారులో మూసివేసిన దాబాను అద్దెకు తీసుకున్నారు. 10 రోజులుగా కల్తీపాలు తయారు చేస్తూ వాటిని నగరంలోని హోటళ్లు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు బుధవారం కల్తీ పాల కేంద్రంపై దాడి చేశా రు. 720 లీటర్ల కల్తీపాలు, 40 కిలోల యూరియా, 2 టాటా ఏస్ ఆటోలు, 10 ఫ్రీడం ఆయిల్ ప్యాకెట్లు, 18 పాలపౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యూరియా, మంచినూనెను ఉపయోగించి కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రషీద్, రవిని పట్టుకున్నారు. వారు గతంలోనూ కల్తీ పాలను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాలపొడిలో పురుగులు.. నెస్లెకు మరిన్ని కష్టాలు
ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ వివాదంతో తలపట్టుకున్న నెస్లె ఇండియా కంపెనీకి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన పిల్లల పాలపొడిలో పురుగులు కనిపించాయి. కోయంబత్తూరుకు చెందిన కె. ప్రేమ్ అనంత్ అనే టాక్సీ డ్రైవర్ తన కవల పిల్లల కోసం నెస్లె వారి నాన్ ప్రో3 అనే పాల పొడిని కొన్నారు. కానీ అందులో లార్వాతో పాటు.. సాధారణంగా బియ్యంలో కనిపించే పెంకిపురుగులు కూడా వచ్చాయి. 28 లార్వా, 22 పెంకి పురుగులు ఆ పాలపొడి డబ్బాలో ఉండటంతో.. ఆ పాలపొడి సురక్షితమైనది కాదని తమిళనాడు ఆహారభద్రతా విభాగం ప్రకటించింది. 18 నెలల వయసున్న తన కవల పిల్లల్లో ఒకరికి అనంత్ ఆ పాలపొడితో కలిపిన పాలు పట్టేశారు. మరొకరికి కూడా పట్టబోతుంటే.. అప్పుడు పురుగులను గమనించారు. పాలు పట్టిన రెండు రోజుల తర్వాత చర్మం మీద ఎలర్జీ రావడంతో.. ఆ పాపను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దాంతో అనంత్ నెస్లె కస్టమర్ సపోర్ట్ నెంబరుకు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఈ విషయం ఏంటో చూడాలని స్థానిక ఏరియా మేనేజర్ కృష్ణపెరుమాళ్ను పంపారు. ఆయన ఆ డబ్బాకు బదులు మరో డబ్బా ఇస్తామని చెప్పగా, అనంత్ తిరస్కరించారు. దాంతో తమ కంపెనీ ల్యాబ్‌లో దాన్ని పరీక్షిస్తామని తెలిపినా ఒప్పుకోలేదు. తమిళనాడు ఆహారభద్రత, ఔషధ నియంత్రణ విభాగం వద్దకు వెళ్లి శాంపిళ్లను ఇచ్చారు. దాంతో విషయం తేలింది. -
సర్వం కల్తీమయం
ఆదిలాబాద్ రిమ్స్ : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. మార్కెట్లో లభించే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. తినే తిండిలో.. తాగే పాలల్లో.. వాడే దినుసుల్లో.. ఇలా.. సర్వం కల్తీమయమే. కళ్లకు కనిపించని విధంగా కల్తీ చేస్తున్నారు. దీంతో మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది స్వచ్ఛమైనదో చెప్పలేని పరిస్థితి ఉంది. కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థం వ్యక్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపే ప్రమాదముంది. అయితే కొంత అప్రమత్తత, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కల్తీని గుర్తించడం సాధ్యమే. ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా.. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కల్తీ జరిగే వస్తువులు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, కల్తీని గుర్తించే విధానంపై కథనం.. నూనెలు.. కొబ్బరి నూనెలో ఆముదం కలిపి కల్తీ చేస్తారు. ఆముదం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కానీ.. కొబ్బరి నూనె కంటే ఆముదం ధర తక్కువ ఉండడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గుర్తించడం ఇలా.. : ప్రయోగశాలల్లో అయితే రసాయనాలతో పరీక్షిస్తారు. అదే ఇంటి దగ్గరైతే చేతితో పట్టుకున్నప్పుడు బాగా జిడ్డుగా ఉన్నట్లయితే ఆముదం కలిపినట్లుగా గురించొచ్చు. కారం.. కారం ఎర్రగా ఆకర్షణీయంగా ఉండడానికి కొన్ని రకాల రంగులు కలుపుతారు. రంపపు పొట్టుతోనూ కల్తీ చేస్తారు. దీనివల్ల ఎలర్జీ, నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక కూర పొడుల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు. ధనియాల పొడిలో ఎక్కువ ఉప్పు కలుపుతారు. గుర్తించడం ఇలా.. : రెండు గాజు పాత్రల్లో నీళ్లు తీసుకుని కారం, ధనియాల పొడిని చెంచా చొప్పున వేయాలి. కల్తీ జరిగి ఉంటే రంపం పొట్టు నీటిపై తేలుతుంది. ఇటుక పొడి వంటివి అడుగున పేరుకుంటాయి. ఇలా కాకుండా నీటిలో కలిసిపోతే అవి స్వచ్ఛమైనవని గుర్తించాలి. నెయ్యి.. స్వచ్ఛమైనదని మురిసిపోతూ మనం తెచ్చుకునే నెయ్యిలో ఎక్కువ భాగం వనస్పతి కలుపుతున్నారు. వనస్పతి వంటి నెయ్యి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుర్తించడం ఇలా.. : ఐదు మిల్లీలీటర్ల నెయ్యిలో 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోమిక్ ఆమ్లం కలపండి. కొద్దిగా చక్కెర చేర్చండి. అప్పుడు నెయ్యి ఇటుక రంగులోకి, ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. కాఫీ పొడి.. కాఫీ పొడిలో సాధారణంగా వేయించిన ఈత గింజల పొడి, చింత గింజల పొడి కలిపి కల్తీ చేస్తుంటారు. గుర్తించడం ఇలా..: కొంచెం కాఫీ పౌడర్‌ను నీళ్లలో వేస్తే.. మంచిదైతే పైన తేలుతుంది. లేదంటే అడుగున పేరుకుపోతుంది. కందిపప్పులో కేసరి.. కందిపప్పులో కేసరి పప్పు (లంకపప్పు ) కలిపి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కందిపప్పులో కలిపే గడ్డిశెనగ పప్పు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. గుర్తించడం ఇలా.. : కొద్దిగా కందిపప్పు తీసుకొని నీళ్లలో పది నిమిషాలు ఉంచాలి. నీరు రంగు మారితే కల్తీ జరిగినట్లే. తేనె.. మార్కెట్లో సీలు లేకుండా పెద్దపెద్ద సీసాల్లో తేనె అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా బెల్లం పానకమే ఉండే అవకాశం ఉంది. గుర్తించడం ఇలా.. : ముందుగా శుభ్రమైన వస్త్రం ముక్కను మీరు కొన్న తేనెలో కలిపి అగ్గిపుల్లతో వెలిగించండి. స్వచ్ఛమైన తేనె అయితే మంట పెరుగుతుంది. లేదంటే కొంచెం కాలిన తర్వాత ఆరిపోతుంది. లేదా గాజు పాత్రలో నీళ్లు తీసుకొని అందులో చెంచా తేనె వేయండి. పాకం అయితే కరిగిపోయి నీటి రంగులోకి మారుతుంది. అదే స్వచ్ఛమైన తేనె అయితే వేసినచోటే అలా ముద్దలా ఉండిపోతుంది. పాలు.. పాలు చిక్కగా కనిపించడం కోసం బియ్యం పిండి గంజి కలుపుతారు. ఇలా చేస్తే చూడడానికి చిక్కగా ఉంటాయి. ఆరోగ్యపరంగా నష్టం కలగకపోయినా ఆర్థికంగా నష్టమే. ఇలా గుర్తించాలి..: చిన్న పాత్రలో కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానికి నాలుగైదు చుక్కల అయోడిన్ కలపాలి. అప్పుడు పాలు నీలి రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. చక్కెర.. చక్కెరలో ఎక్కువ బొంబాయి రవ్వ కలిపి కల్తీ చేస్తారు. గుర్తించడం ఇలా.. : పాలు లేదా నీళ్లలో చెంచా చక్కెర వేయాలి. అందులో రవ్వ కలిపి ఉంటే అడుగున తెల్లని పొర ఏర్పడుతుంది. కోవా, జున్ను, పాలపొడి.. కోవా, జున్నుల్లో బియ్యం పిండితో కల్తీచేస్తారు. పాల పొడిలోనూ బియ్యం పిండి కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా జున్ను తీసుకుని అయోడిన్ కలపాలి. నీలం రంగు కనిపిస్తే అందులో బియ్యం పిండి కలిపినట్లే. వక్కపొడి.. వక్కపొడిలో రంపపు పొట్టు కలుపుతారు. వీటికి ముదురు రంగలనూ కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా వక్కపొడి చేతిలో తీసుకుని గట్టిగా నలిపితే రంగు అంటుకుంటే కల్తీ జరిగిందని భావించాలి. లేదా నీటిలో వేసి చూసినా రంగు వెంటనే కరిగిపోతుంది. నీళ్ల రంగు మారుతుంది.