Recipe: బ్రెడ్‌ జామూన్‌ ఇంట్లోనే తయారు చేసుకోండిలా! | Recipes In Telugu: How To Make Bread Jamun | Sakshi
Sakshi News home page

Bread Jamun Recipe: బ్రెడ్‌ జామూన్‌ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

Published Tue, Aug 16 2022 7:14 PM | Last Updated on Tue, Aug 16 2022 7:21 PM

Recipes In Telugu: How To Make Bread Jamun - Sakshi

నోరూరించే బ్రెడ్‌ జామూన్‌ ఇలా తయారు చేసుకోండి.
కావలసినవి:
►పంచదార – కప్పు
►యాలకులు – మూడు (పొడిచేసుకోవాలి)
►నిమ్మరసం – టేబుల్‌ స్పూను
►తెల్లని బ్రెడ్‌ స్లైస్‌లు – ఆరు

►క్రీమ్‌ మిల్క్‌ పౌడర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఫ్రెష్‌ క్రీమ్‌ – టేబుల్‌ స్పూను
►వేడి పాలు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►నెయ్యి లేదా నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.

తయారీ:
►గిన్నెలో పంచదార, కప్పు నీళ్లుపోసి వేడిచేయాలి
►సన్నని మంటమీద సుగర్‌ సిరప్‌ తయారయ్యేవరకు మరిగించాలి
►సిరప్‌ అయ్యిందనుకున్నప్పుడు యాలకులపొడి, నిమ్మరసం వేసి చక్కగా కలిపి తిప్పి, స్టవ్‌ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి
►ముదురు రంగులో ఉన్న బ్రెడ్‌ స్లైసుల అంచులు కత్తిరించాలి.
►ఇప్పుడు మిగిలిన స్లైసుని ముక్కలుగా తరిగి, తరువాత పొడిచేసుకోవాలి

►ఈ పొడిలో పాలపొడి, ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి కలపాలి.
►ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా పాలు పోస్తూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి
►చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కనపెట్టుకోవాలి
►వేడెక్కిన నూనెలో ఈ ఉండలను వేసి సన్నని మంటమీద గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీసుకోవాలి
►అన్ని ఉండలు వేగిన తరువాత వెంటనే సుగర్‌ సిరప్‌లో వేసి రెండు గంటలపాటు ఉంచి, తరువాత సర్వ్‌చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Recipes: శాగూ కేసరి.. పన్నీర్‌ వైట్‌ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి!
Fish Omelette Rolls Recipe: నోరూరించే ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement