Best Bobbatlu Recipes In Telugu: How To Prepare Paneer Bobbatlu Sweet Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Paneer Bobbatlu: పనీర్‌ తురుము, మైదాపిండితో నోరూరించే బొబ్బట్లు.. తయారీ ఇలా

Published Wed, Jan 18 2023 4:06 PM | Last Updated on Wed, Jan 18 2023 5:16 PM

Recipes In Telugu: How To Prepare Paneer Bobbatlu - Sakshi

నోరూరించే పనీర్‌ బొబ్బట్లు తయారు చేసుకోండిలా..!
కావలసినవి: 
►పనీర్‌ తురుము, మైదాపిండి – 1 కప్పు చొప్పున
►పంచదార పొడి – అర కప్పు

►ఏలకుల పొడి – అర టీ స్పూన్‌
►పచ్చి కోవా – కొద్దిగా, ఉప్పు – సరిపడా
►నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్ల పైనే

తయారీ: 
►ముందుగా మైదాపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం ఒక బౌల్‌ తీసుకుని.. అందులో పనీర్‌ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, ఏలకుల పొడి వేసుకుని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి.
►ఇప్పుడు కొద్దికొద్దిగా మైదా మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న అట్లు మాదిరి ఒత్తుకోవాలి.
►మధ్యలో పనీర్‌ మిశ్రమంతో తయారు చేసుకున్న బాల్స్‌ని ఉంచి.. చుట్టూ మైదా మిశ్రమంతో మళ్లీ బాల్స్‌లా చేసుకుని వాటిని అట్లుగా ఒత్తుకోవాలి.
►వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెనంపైన నేతిలో వేయిస్తే భలే రుచిగా ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement