‘‘టి. కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది. గోపీ గణేష్ తీసిన ‘గాడ్సే’ సినిమా ఆ లోటును తీర్చేసింది’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సత్యదేవ్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని గోపీ గణేష్ చక్కగా తెరకెక్కించాడు. అవినీతి రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులపై సత్యదేవ్ గాడ్సేలా పోరాటం చేస్తాడు’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పటి వరకూ 83 సినిమాలు నిర్మించాను.
చదవండి: అర్హత ఉన్నోడే అసెంబ్లీ..పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి
అయితే ‘గాడ్సే’ సినిమా నిర్మించినందుకు హ్యాపీగా, గర్వంగా ఉంది. మరో సినిమాకి గోపీ గణేష్‌కి చెక్ కూడా ఇచ్చాను. ఎన్టీఆర్, శివాజీ గణేశన్‌గార్లలా క్యారెక్టర్‌లో షేడ్స్‌ను చూపించగల నటుడు సత్యదేవ్’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ముందు కె.ఎస్. రామారావుగారే ఆరంభించారు. ఆ తర్వాత కల్యాణ్‌గారు టేకప్ చేసి పూర్తి చేశారు. ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం తర్వాత మళ్లీ కల్యాణ్‌గారితో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారు చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment