Satyadev Godse Movie Official Trailer Out, Watch It Now - Sakshi
Sakshi News home page

Godse Movie Trailer: అర్హత ఉన్నోడే అసెంబ్లీ..పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి

Jun 9 2022 11:47 AM | Updated on Jun 9 2022 12:21 PM

Satyadev Godse Movie Trailer Out - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రం గాడ్సే. ఈ చిత్రానికి గోపి గణేష్‌ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు.  సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు లో హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.‘సత్యమేవ జయతే అంటారు..  'ధర్మో రక్షితి రక్షత: అంటారు.. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.

అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ధైర్యవంతుడి పాత్రలో సత్యదేవ్‌ నటించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది.‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?' 'ప్రశ్నిస్తే... మారణకాండ చేసేస్తారా?, ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్‌ కావాలి.. సబ్జెక్ట్‌ ఉన్నో సర్పంచ్‌ కావాలి’, ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. జూన్‌17న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement