డోల్ బాజారే డోల్ | Balakrishna satya dev movie song shooting in Ciran Fort Palace | Sakshi
Sakshi News home page

డోల్ బాజారే డోల్

Published Mon, Nov 24 2014 11:39 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

డోల్  బాజారే  డోల్ - Sakshi

డోల్ బాజారే డోల్

 ఇవాళ్టికీ డాన్స్ అంటే చాలు ఎక్కడ లేని హుషారొచ్చేస్తుంది బాలకృష్ణకు. నూతన దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న తన 98వ చిత్రం కోసం కోసం హైదరాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్‌లో వేసిన సంగీత్ సెట్‌లో ఆ చిత్ర కథానాయికల్లో ఒకరైన రాధికా ఆప్టేతో కలిసి ఓ స్థాయిలో స్టెప్పులేస్తున్నారు బాలయ్య. భాస్కరభట్ల రాసిన ‘డోల్ బాజారే డోల్’ పల్లవితో సాగే ఈ పాటకు బృందా మాస్టర్ నృత్య రీతుల్ని సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, రాధికా ఆప్టేలతో పాటు మూడొందల మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొన్నారు.
 
  మూడ్రోజులుగా జరుపుకుంటున్న ఈ పాట చిత్రీకరణ ఇవాళ్టితో పూర్తవుతుంది. ఈ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇందులో బాలయ్య పాత్ర అత్యంత శక్తిమంతంగా, గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందనీ, మాస్ ప్రేక్షకులకు ఇది పసందైన విందుభోజనం లాంటి సినిమా అవుతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు జోడీగా తొలిసారి త్రిష నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: వెంకట్‌ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement