తమన్నా-సత్యదేవ్‌ ‘గుర్తుందా శీతాకాలం’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే! | Tamanna, Satyadev Gurthunda Seethakalam Release On July 15th | Sakshi
Sakshi News home page

Gurthunda Seethakalam: తమన్నా-సత్యదేవ్‌ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే!

Published Fri, Jun 10 2022 2:23 PM | Last Updated on Fri, Jun 10 2022 2:23 PM

Tamanna, Satyadev Gurthunda Seethakalam Release On July 15th - Sakshi

టాలెంటెడ్‌ హీరో సత్యదేశ్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డైరెక్టర్‌ నాగశేఖర్‌ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా, పెద్ద సినిమాల విడుదలతో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసి ప్రకటించారు. గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నామంటూ తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు.

చదవండి: సోషల్‌ మీడియాలో అశ్లీల కామెంట్స్‌, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

అయితే ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిలైయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్‌ లైఫ్‌ చాలామందికి ఓ మధుర జ్ఞాపకంలా ఉంటుంది. జీవితంలో సెటిలయ్యాక తమ కాలేజ్‌ డేస్, యూత్‌ఫుల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆనందపడతారు. అలాంటి సంఘటనల సమాహారంతో ‘గుర్తుందా శీతాకాలం’ రూపొందింది. నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్‌.ఎస్‌. రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement