Ram Setu: రామ సేతు ట్రైలర్‌ వచ్చేసింది | Ram Setu Tralier Out | Sakshi
Sakshi News home page

Ram Setu:ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో సాగుతుంది.. ఆకట్టుకుంటున్న రామసేతు ట్రైలర్

Oct 11 2022 2:07 PM | Updated on Oct 11 2022 2:11 PM

Ram Setu Tralier Out - Sakshi

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్‌ సేతు’.  రామ్‌ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్‌ అండ్‌ టాలెంట్‌ హీరో సత్యదేవ్‌ మరో కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో తాజాగా  ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో సాగుతుంది..’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.

 శ్రీ రాముడు నిర్మించిన రామ సేతు గురించి ఈ చిత్ర కథాంశం తిరుగుతోంది. ‘ఈ ప్రపంచంలో శ్రీరామునికి వేలాది మందిరాలు ఉన్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది’, ‘మన దేశంలో ఏడాది క్రితం వేసిన రోడ్లే గుంతలు పడుతున్నాయి.. మరి ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి వెతకడం ఏంటి’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement