rama setu
-
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
సైన్స్‌కు, స్పిరిచ్యువాలిటీకి లంకె కుదరదు. లాజిక్కులు, ఆధారాలపై సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాతాన గ్రంథాల్లో చెప్పినవాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సాక్ష్యాధారాలు కావాలంటుంది సైన్స్. ఐతే ఇంత అత్యాధునిక కాలంలోనూ, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్నో రహస్యాలను సైన్స్ ఛేదించలేకపోయిందని ఆధ్యాత్మిక వాదులు అంటారు. పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇంకా బయటపడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్యనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఆ కోవలోకే వస్తుందీ రామసేతు. శాస్త్ర-సాంకేతిక రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు మంచి పేరే ఉంది. అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువ. ఏడేళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలు పంపించింది. మనదేశాన్ని, శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలు అవి. భారత్, శ్రీలంక మధ్య హిందూమహాసముద్రం లోతు తక్కువ ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్య కర పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఆ ఉపగ్రహం గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించి ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది.నాసా శాటిలైట్ పంపిన ఫోటోల్లో ఉన్న రాళ్లు మామూలు రాళ్లు కాదు. చాలా పెద్ద పెద్ద బండరాళ్లు అవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగి పోయింది. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఉన్న రాళ్లు భారత్, శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతివంతెనకు సంబంధించినవి. దాంతో ఇండియానా యూనివర్సిటీ నార్త్ వెస్ట్, యూనివర్సిటీ ఆప్ కొలరాడో బౌల్డర్, సదరన్ ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, జియోలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశీలనల్లో ఆ రాతి వంతెన 30 మైళ్ల పొడవుతో ఉన్నట్లుగా బయటపడింది. సైంటిస్టులు, జియోలజిస్టులు పరిశోధించిన రాతి వంతెన మరేదో కాదు. భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన శ్రీరామసేతు అది. ఆడమ్ బ్రిడ్జ్‌గా, సేతుబంధనంగా పేర్కొనే రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లు అవి. దాంతో శాస్త్రజ్ఞుల దృష్టి ఆ రాళ్లు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భశాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక, రాతి వంతెన నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్‌లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడినదే అని బయటపడింది. మరి రాతి వంతెన నిర్మాణం మాటేమిటి. అదే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు యావత్ ప్రపంచపు దృష్టిని మళ్లీ రామసేతుపై పడేలా చేసింది.నాసా శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా రాతి వంతెనపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో, ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు. ఎవ్వరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎలా అక్కడికి చేరుకున్నాయి...?ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని తేల్చిన శాస్త్రవేత్తలు రాళ్ల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. జియోలజిస్టులు రంగంలోకి దిగి ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్‌లో మరో విస్మయకర విషయం బయటపడింది. శాస్త్రీయ విశ్లేషణల ప్రకారం ఆ రాళ్లు 7వేల ఏళ్ల క్రితం నాటివి. కానీ ఆశ్చర్యకరంగా రాళ్లతో ఉన్న ఇసుక మాత్రం 4వేల ఏళ్ల క్రితం నాటిదే. ఇది క్రీస్తు పూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు తక్కువ. కార్బన్ డేటింగ్ప్రక్రియ ఆధారంగా రాళ్లు, ఇసుక వయసులను లెక్క కట్టిన సైంటిస్టులు రాతివంతెన నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. ఆ వారధి మానవులు నిర్మించిందే అని స్పష్టం చేశారు. భారతీయ పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు 5 వేల ఏళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య ఓ వారధి నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీరామునిగా మానవ రూపంలో అవతరించిన భగవానుడు ఆ వారధిని నిర్మించారన్నది హిందువుల విశ్వాసం. ఇప్పుడు విదేశీ సైంటిస్టులు చెబుతున్నది కూడా అదే. అంటే పరిశోధకులు చెబుతున్నదీ, పురాణాలు పేర్కొంటున్నదీ ఒక్కటే అన్నమాట. అంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మిత అద్భుతమే అనుకోవాలి.హిందువుల విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్, శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది.ధనుష్కోడి నుంచి మన్నార్ ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ఆలయవర్గాల సమాచారం ప్రకారం 50 కిలో మీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుపాను ధాటికి ఆ వంతెన కూలిపోయింది.ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై చాలా వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్-ICHR, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ, విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిశోధననలు జరిపాయి. భారత్‌నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపురాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, తర్వాత ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే ఆడమ్ బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్ పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఆ వంతెన లక్ష 25 వేల ఏళ్ల క్రితం నాటిదని అభిప్రాయపడింది. ఐతే రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఉన్న రాళ్ల శాంపిల్లను రేడియో కార్భన్ డేటింగ్లో పరిశోధిస్తే అవి 7 వేల నుంచి 18 వేల ఏళ్ల క్రితం నాటివని బయటపడింది. ప్రొఫెసర్ SM రామస్వామి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్పరిశోధనలో ఆ రాళ్ల వయసు 3 వేల 5 వందల సంవత్సరాలుగా తేలింది. -
రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం
చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు. #WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi visits Arichal Munai point in Dhanushkodi, which is said to be the place from where the Ram Setu was built. pic.twitter.com/GGFRwdhwSH— ANI (@ANI) January 21, 2024 అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
Ram Setu: రామ సేతు ట్రైలర్ వచ్చేసింది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో సాగుతుంది..’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. శ్రీ రాముడు నిర్మించిన రామ సేతు గురించి ఈ చిత్ర కథాంశం తిరుగుతోంది. ‘ఈ ప్రపంచంలో శ్రీరామునికి వేలాది మందిరాలు ఉన్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది’, ‘మన దేశంలో ఏడాది క్రితం వేసిన రోడ్లే గుంతలు పడుతున్నాయి.. మరి ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి వెతకడం ఏంటి’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. -
అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ టీజర్ అవుట్.. కట్టిపడేస్తున్న విజువల్స్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అడ్వెంచరస్ చిత్రం 'రామ్ సేతు'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ అదిరిపోయింది. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..) 'రామ్ సేతు'ను కాపాడేందుకు మన చేతుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి' అనే అక్షయ్ కుమార్ డైలాగ్‌తో మొదలైన టీజర్.. విజువల్స్ కట్టిపడేలా ఉన్నాయి. నీటి అడుగున ఉన్న రామసేతును చూసేందుకు అతను ప్రత్యేకమైన సూట్లో వచ్చి నీటి అడుగున డైవింగ్ చేస్తున్న సీన్లు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ సూట్లో నాజర్ గ్లింప్స్ హైలెట్‌గా ఉన్నాయి. రామ్ సేతుని చేరుకోవడానికి తన బృందంతో కలిసి అక్షయ్ చేసే సాహసాలను టీజర్లో చూపించారు. జాక్వెలిన్ కథానాయికగా నటించనుండగా.. తెలుగు హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. -
తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు... వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. -
రామసేతు చిత్రీకరణ పూర్తి.. ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే 'సూర్యవంశీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అక్కీ. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆత్రంగి రే' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం 'రామసేతు'. ఈ సినిమా చిత్రీకరణ జనవరి 31తో పూర్తియింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'రామసేతు' సినిమా షూటింగ్లో పాల్గొనడమంటే తనకు మరోసారి స్కూల్‌కు వెళ్లిట్లు అనిపించిందని అక్కీ ట్వీట్ చేశాడు. ఈ చిత్రీకరణలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామన్నాడు. అప్పటి రామసేతును వానరుల సహయంతో కట్టారని, ఈ 'రామసేతు' సినిమాను తమ బృందంతో కలిసి నిర్మించామని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచ, సత్యదేవ్ నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. Here’s to the wrap of yet another amazing project #RamSetu. I learned so much during the making of this film, it was like going to school all over again 🙈. बड़ी मेहनत की है हम सबने, अब बस आप का प्यार चाहिए 🙏🏻 pic.twitter.com/v5ywciUu8F — Akshay Kumar (@akshaykumar) January 31, 2022 -
ఇంజనీరింగ్ కోర్సుల్లో రామాయణ, మహాభారతాలు....!
న్యూఢిల్లీ: తులసీదాస్ రచించన రామాయణాన్ని గ్రాడ్యుయేషన్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మధ్య ప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాశ్ సారంగ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భవిష్యత్తరాలలో వైద్య విద్యను హిందీ మాధ్యమంలో చదువుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిలబస్ కమిటీ ఉన్నత విద్యా విధానంలో భాగంగా 2021-22 విద్యా సంవత్సారానికి గానూ రామచరిత మానస్ కీ వ్యవహార దర్శన్ (అప్లైడ్ ఫిలాసఫీ ఆఫ్ రామచరిత మానస్)ని ప్రవేశ పెట్టేలా చేశానని చెప్పారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై ) ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సులో మహాభారతం లాంటి పురాణాలను ప్రవేశపెడితే.. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తోపాటు మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా దోహదపడుతుందన్నారు. ఈ మేరకు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నా పత్రం ఒకటి ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నాయకుల బయోగ్రఫి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో విద్యార్థులు సామాజికంగా, వైద్య పరంగానూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించగలిగే అవకాశం ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ...." విద్యా వ్యవస్థను కాషాయికరణం చేస్తున్నాంటు వస్తోన్న ప్రతి పక్షాల విమర్శలను ఖండించారు. ఈ క్రమంలో నాసా సైతం 'రామసేతు' నిర్మాణాన్ని ప్రాచీన మానవ నిర్మిత నిర్మాణంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి." అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు గురుగ్రంథ సాహెబ్, ఖురాన్, బైబిల్ కూడా చేరిస్తే విద్యార్థులు మరిన్ని నేర్చుకునే అవకాశంతో పాటు రాజ్యంగ స్ఫూర్తి కూడా నెరవేరుతుందంటూ వ్యంగ్యాస్తాలు కురిపించారు. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) -
రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీ
చెన్నై/రామేశ్వరం: సేతు సముద్రం షిప్పింగ్ ప్రాజెక్టును నిర్మించే క్రమంలో శ్రీరాముడు నిర్మించినట్టుగా భావిస్తున్న రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించని రీతిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన తీర రక్షణ దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సేతు సముద్రం నిర్మించదలచిన ప్రాంతాన్ని పరిశీలించారు. సేతు సముద్రం నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విధంగా ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం ద్వారా జరుగుతున్న వాణిజ్యం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మరోవైపు షిప్పింగ్ రంగంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ సమకూర్చుకోవాల్సి ఉందని, దీనికి సంబంధించి కొత్త చట్టాలు రూపొందించుకోవాలని గడ్కారీ చెన్నైలో చెప్పారు. ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు విధించిన ఉరి శిక్ష అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, శిక్ష పడిన జాలర్లను వెనక్కి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేసిందన్నారు.