రామసేతు చిత్రీకరణ పూర్తి.. ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్ | Akshay Kumar Interesting Comments On Ram Setu Movie | Sakshi
Sakshi News home page

Akshay Kumar: రామసేతు చిత్రీకరణ పూర్తి.. ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్

Published Tue, Feb 1 2022 2:10 PM | Last Updated on Tue, Feb 1 2022 2:12 PM

Akshay Kumar Interesting Comments On Ram Setu Movie - Sakshi

బాలీవుడ్​ యాక్షన్​ హీరో అక్షయ్​ కుమార్​ ఎప్పుడూ సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంటాడు. ఇటీవలే 'సూర్యవంశీ' సినిమాతో బ్లాక్​ బస్టర్ హిట్​ అందుకున్నాడు అక్కీ. అలాగే ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వంలో వచ్చిన 'ఆత్రంగి రే' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది. తాజాగా అక్షయ్​ కుమార్​ నటిస్తున్న చిత్రం 'రామ​సేతు'. ఈ సినిమా చిత్రీకరణ జనవరి 31తో పూర్తియింది. ఈ సందర్భంగా అక్షయ్​ కుమార్ పలు ఆసక్తికర విషయాలు సోషల్​ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

'రామసేతు' సినిమా షూటింగ్​లో పాల్గొనడమంటే తనకు మరోసారి స్కూల్​కు వెళ్లిట్లు అనిపించిందని అక్కీ ట్వీట్​ చేశాడు. ఈ చిత్రీకరణలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాని, ఎంతో కష్టపడి షూటింగ్​ పూర్తి చేశామన్నాడు. అప్పటి రామసేతును వానరుల సహయంతో కట్టారని, ఈ 'రామసేతు' సినిమాను తమ బృందంతో కలిసి నిర్మించామని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్​ భరూచ, సత్యదేవ్ నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement